
తాజా వార్తలు
బీజింగ్: అమెరికాతో వాణిజ్య యుద్ధం కొనసాగుతున్నప్పటికీ చైనాలోని కుబేరులు మరింత ధనవంతులయ్యారు. ఆర్థిక రంగం మందగమనంలో ఉన్నప్పటికీ ఇబ్బందులను అధిగమించారు. ‘హురున్ ధనవంతుల నివేదిక’లోని తాజా వివరాల ప్రకారం గత ఏడాది(2018)తో పోల్చినప్పుడు 1,800 మంది ధనవంతుల ఆస్తులు ఈ ఏడాది 10 శాతం మేర పెరిగాయి. ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా సంస్థ ఛైర్మన్‌గా గత నెలలో పదవీ విరమణ చేసిన జాక్ మా 39 బిలియన్ డాలర్లు (రూ.2.77లక్షల కోట్లు) ఆస్తితో ప్రథమ స్థానంలో నిలిచారు. ఐటీ, సామాజిక మాధ్యమాలు, ఔషధాలు, విద్యా రంగంలో ఉన్నవారి ఆస్తులు పెరిగాయి. వస్తువుల తయారీ వంటి సంప్రదాయ రంగాల్లో ఉన్న వారి ఆస్తులు తగ్గాయి. దాంతో మొత్తం ధనవంతుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. 2018లో కుబేరుల జాబితాలో 1,893 మంది ఉండగా, ఈ ఏడాది వారి సంఖ్య 1,819కి పడిపోయింది.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
