close

తాజా వార్తలు

నెల్లూరులో అగ్నిప్రమాదం

నెల్లూరు: నెల్లూరు నగరంలోని చిన్నబజారులో సంభవించిన అగ్నిప్రమాదం ఒక్కసారిగా అందరిలో ఉలికిపాటును కలిగించింది. దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్న తరుణంలో బహుళ అంతస్తు భవనంలో ఎగసిపడిన అగ్నికీలలు అందరికీ భయాందోళనలు కలిగించాయి. కోట్లాది రూపాయలు విలువ చేసే ప్లాస్టిక్ వస్తువుల దుకాణం కావడంతో తెల్లవారు జామువరకు మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. ప్రధాన వ్యాపార కూడలి కావడంతో చుట్టుపక్కల మంటలు వ్యాపిస్తాయని అధికారులు భయపడిపోయారు. 


విద్యుత్‌ డీఈపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్‌
నెల్లూరు నగరంలో చిన్నబజారు ప్రధాన వ్యాపార కూడలి. కోట్లాది రూపాయలు వ్యాపారం జరిగే ప్రాంతం. ఇంతటి ప్రధాన కూడలిలో కనకదుర్గా ఎంటర్ ప్రైజెస్ పేరుతో నిర్వహిస్తున్న ప్లాస్టిక్ హోల్ సేల్ దుకాణం లో
పెట్రోల్ కెమికల్స్‌తో తయారు చేసిన ప్లాస్టిక్ బండిల్స్ అనేకం ఉన్నాయి. వీటికి ఒక్కసారి మంటలు అంటుకుంటే ఆర్పివేయడం చాలా కష్టం. రాత్రి అందరూ ఆనందంగా టపాసుల కాల్చుకుంటూ సందడిలో ఉండగా.. వ్యాపార కూడలిలోని బహుళ అంతస్తు భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాత్రి 9గంటల ప్రాంతంలో మంటలు వ్యాపిస్తే 9.30నిమిషాలకు ఒక్క అగ్నిమాపక యంత్రం వచ్చింది. భారీ అగ్నిప్రమాదం కావడంతో అధికారులు ఎంత ప్రయత్నించినా మంటలు చల్లరలేదు. ఎగసిపడుతూనే ఉన్నాయి. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు వెంటనే ఘటనాస్థలానికి వచ్చారు. 10 గంటల తరువాత రెండో అగ్నిమాపక యంత్రం వచ్చింది. నీటి సమస్య కారణంగా మంటలను అర్పలేకపోయారు. అర్ధరాత్రి 11గంటలకు మరో రెండు యంత్రాలు వచ్చినా ఫలితం లేదు. నాలుగువైపులా అగ్నికీలలు అంటుకున్నాయి. ఒకవైపు ఆర్పుతుంటే మరోవైపు ఎగిసిపడుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఆరుగంటలసేపు ప్రయత్నించినా మంటలను అదుపుచేయలేకపోయారు. ఇంతా జరుగుతున్నా.. విద్యుత్ డీఈ ఘటనా స్థలానికి రాకపోవడంతో జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.

నిప్పురవ్వలు పడడం వల్లేనా?
ఇంతటి అగ్నిప్రమాదం సంభవించడానికి కారణం భవనం పై ఉన్న థర్మాకోల్ షీట్లపై నిప్పురవ్వలు పడడం వల్లే అని స్థానికులు అనుమానిస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? అన్న కోణంలోనూ అధికారులు విచారిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే భవనంలో ఉన్న ఆరు కుటుంబాలను సురక్షితంగా వేరే చోటుకి తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఏం జరగలేదు. ఆరు అగ్నిమాపక యంత్రాలు వచ్చినా మంటలను అదుపులోకి తీసుకురాలేక పోయారు. కోట్లాదిరూపాయలు విలువచేసే ప్లాస్టిక్ పరికరాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.