
తాజా వార్తలు
హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన సకలజనుల సామూహిక దీక్ష ఉద్రిక్తంగా మారింది. ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకునేందుకు యత్నించిన ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులు, ఓయూ విద్యార్థులు, ప్రజా సంఘాలు, విపక్ష నేతలను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. పోలీసులకు, కార్మికులకు మధ్య జరిగిన తోపులాటలో ఓ ఆర్టీసీ కార్మికుడు అస్వస్థతకు గురికావడంతో పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల ఏర్పాటు చేసిన బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు దూకి ట్యాంక్‌బండ్ మీదకు మహిళా కార్మికులు దూసుకెళ్లారు. ఆర్టీసీ కార్మికులు, విద్యార్థి సంఘాల నేతలు వెంకటస్వామి విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తుండగా.. వారిని పోలీసులు అరెస్టు చేశారు. పలువురు నేతలతో పాటు 300 మందికి పైగా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఎంబీ భవన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, అరుణోదయ సమాఖ్య నాయకురాలు విమలక్క, ఇతర నేతలు బారికేడ్లు తోసుకుంటూ ముందుకు సాగడంతో అశోక్‌నగర్‌లోని ఇందిరాపార్కు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తమ డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేస్తుంటే తమపై లాఠీఛార్జి చేస్తారా?అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పోలీసులు తాళ్లతో నెడుతూ ఆందోళనకారులను లిబర్టీ వైపు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ర్యాపిడ్ యాక్షన్ బలగాలను రంగంలోకి దించింది. దీంతో వారు భాష్పవాయు వాహనాలతో ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్నారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ఎన్‌కౌంటర్‌ను నిర్ధారించిన సజ్జనార్
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
