close

తాజా వార్తలు

ఫాల్కే అవార్డుల వేడుక ఎప్పుడంటే?

హైదరాబాద్‌: భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే సౌత్-2019 అవార్డుల వేడుక తెరలేచింది. సెప్టెంబరు 20న ఈ వేడుక జరగనుంది. మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ దీనికి వేదిక కానుంది. ఈ సందర్భంగా దక్షిణ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖుల్ని సత్కరించనున్నారు. ఈ వేడుకలో సినీ తారలు బ్రహ్మానందం, మోహన్ బాబు, మహేశ్‌ బాబు, పూరీ జగన్నాథ్, అనుష్క, సమంత, జగపతి బాబు, రకుల్‌ప్రీత్‌ సింగ్, దేవిశ్రీ ప్రసాద్, నందితా శ్వేత, పాయల్‌ రాజ్‌పుత్, ఛార్మి, మంచు లక్ష్మి తదితరులు పాల్గొననున్నారు.

ఈ వేడుక నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సినీ ప్రముఖులతోపాటు రాజకీయ, వ్యాపార దిగ్గజాలు, ప్రత్యేక అతిథులు కూడా హాజరుకాబోతున్నారు. దక్షిణ చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలందిస్తున్న వారిని ప్రత్యేకంగా సన్మానించనున్నారు. ఈ వేడుకను ప్రత్యక్ష్యంగా వీక్షించాలనుకునే సినీ అభిమానుల కోసం ఆన్‌లైన్‌లో టికెట్లను అందుబాటులో ఉంచారు. ఇటీవలే బాలీవుడ్‌లో ఈ అవార్డుల పండగ అద్భుతంగా జరిగింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.