
తాజా వార్తలు
ఫొటో బయటపెట్టిన దర్శకుడు
ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ యానిమేటెడ్ సినిమా ‘ది లయన్ కింగ్’ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన వసూళ్లు రాబడుతోంది. అయితే ఈ యానిమేటెడ్ చిత్రంలో ఇదొక్కటే నిజమంటూ దర్శకుడు జాన్ ఫెవరూ ఓ ఫొటోను విడుదల చేశారు. ‘‘ది లయన్ కింగ్’లో ఈ ఒక్క షాట్ మాత్రమే నిజమైంది. యానిమేటర్స్, సీజీలతో 1490 షాట్లను సృష్టించాం. ఆఫ్రికాలో తీసిన ఒకేఒక్క రియల్ షాట్‌ను మీకు షేర్ చేస్తున్నా. సినిమాలో దీన్ని ఎవరైనా గుర్తుపట్టొచ్చు. ఇది సినిమాలోని మొదటి షాట్’ అని ట్వీట్ చేశారు.
కార్టూన్ నెట్‌వర్క్‌లో కామిక్ సీరియల్‌గా మొదలైన ‘లయన్ కింగ్’ని ఆ తర్వాత డిస్నీ 2డీ యానిమేటెడ్ సినిమాగా 1990లలో విడుదల చేశారు. అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు ఇప్పుడు 3డీ యానిమేటెడ్ టెక్నాలజీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ జోడించి డిస్నీ అభిమానులకి సరికొత్త అనుభూతిని ఇచ్చింది. ఈ సినిమా భారత్‌లో జులై 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి వారాంతంలో దాదాపు రూ.50 కోట్లు రాబట్టి బాలీవుడ్ చిత్రాలకు బాక్సాఫీసు వద్ద గట్టి పోటీగా నిలిచింది. ఇప్పుడు రూ.100 కోట్లు రాబట్టే దిశగా పరుగులు తీస్తోంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
