close

తాజా వార్తలు

‘చిత్ర’ వార్తలు

గెలిచిన సంకల్పం.. ఓడిన వైకల్యం

మిస్ డెఫ్ వరల్డ్ కిరీటాన్ని భారతీయ యువతి గెలుచుకుంది. దక్షిణాఫ్రికాలో నిర్వహించిన పోటీల్లో ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన 21 సంవత్సరాల విదిషా బాలియన్ విజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయురాలుగా రికార్డుకెక్కింది. దక్షిణాఫ్రికాలో నిర్వహించిన పోటీల్లో 16 దేశాలు పాల్గొనగా ఫైనల్‌లో 11 మంది పోటీపడ్డారు. విదిషా టెన్నిస్‌ క్రీడాకారిణి. డెఫిలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది

‘83’ కోసం..

మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న బాలీవుడ్‌ చిత్రం ‘83’. ఇందులో కపిల్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ కనిపించనున్నారు. లండన్‌లో ‘83’ చిత్రబృందాన్ని మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ కలుసుకున్నారు. ఈ చిత్రాలు సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి

వేషమేదైనా తరగని వ్యామోహం

హైదరాబాద్‌: ఆషాఢ బోనాల సందర్భంగా ప్రదర్శనలో పాల్గొనే ముందు సెల్ఫీ దిగుతున్న దేవత వేషధారణలో ఉన్న కళాకారుడు

వెంకయ్య కంటతడి


తన ఆప్తమిత్రుడు జైపాల్‌రెడ్డి మృతితో రాజ్యసభలో కన్నీరుమున్నీరైన ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు. రాజ్యసభ సమావేశం ప్రారంభ సమయంలో జైపాల్‌రెడ్డికి సంతాపం తెలుపుతూ ఇలా వెంకయ్యనాయడు భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు

నవ్వుల నాయక

ముంబయిలో ఓ సంస్థ ఉత్పత్తుల ప్రచార కార్యక్రమంలో నవ్వులు చిందిస్తున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 

మరో ‘ప్రస్థానం’

ముంబయి : ‘ప్రస్థానం’ చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్‌ దత్‌, మనీషా కొయిరాలా, మాన్యత దత్‌, జాకీ ష్రాప్‌. 2010లో విడుదలైన తెలుగు సినిమా ‘ప్రస్థానం’ ఇప్పుడు హిందీలో అదే పేరుతో రీమేక్‌ చేశారు.  మాతృక దర్శకుడు దేవా కట్టా బాలీవుడ్‌లోనూ తెరకెక్కిస్తున్నారు. మాన్యత దత్‌ నిర్మాత.

సభాపతి పాత్ర ముగిసింది!

కర్ణాటక స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేసి విధాన సౌధ నుంచి బయటకు వెళుతున్న దృశ్యం

విశ్వాస పరీక్షలో సీఎం యడియూరప్ప నెగ్గిన అనంతరం తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్‌ కృష్ణారెడ్డికి అందజేస్తున్న రమేశ్‌ కుమార్‌

మోదీ వర్సెస్‌ వైల్డ్‌!


ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఓ రియాల్టీ షోలో కనిపించనున్నారు. ప్రముఖ బ్రిటిష్‌ అడ్వెంచరర్‌ బేర్‌ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్కులో విహరించారు. పర్యావరణ, జంతుసంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మోదీ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ కార్యక్రమంలో ఆగస్ట్‌ 12న ఇది ప్రసారం కానుంది

జన సందోహం..

కావడి యాత్రకు భక్తులు పోటెత్తారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో శివ భక్తులు నర్మదా నదిలో పుణ్యస్నానం చేసేందుకు బారులు తీరారు. కావడి యాత్రతో ప్రధాన రహదారులు భక్తులతో కిక్కిరిసిపోయాయి

రోడ్డుపైకి పులులు!


నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం. ఈ సందర్భంగా పుణెలో జంతుసంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. స్థానిక పాఠశాల విద్యార్థులు ఇలా ముఖానికి పులి ఆకారంలో పెయింటింగ్‌ వేసుకుని, పులి మాస్క్‌లు ధరించి ఈ ర్యాలీలో పాల్గొన్నారు

కోల్‌కతాలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో విద్యార్థులు ఇలా పులి వేశంలో అలరించారు.

కనుల విందు


ఫ్రాన్స్‌లోని చాంబ్లీలో మండయల్‌ ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా వందల సంఖ్యలో హాట్‌ ఎయిర్‌ బెలూన్లను ఒకే సారి గాల్లోకి ఎగరవేయడం చూపరులను ఆకట్టుకుంది. 2017లో ఒక గంటలో 456 బెలూన్ల ఒకేసారి నింగిలోకి ఎగరవేసిన రికార్డును చెరిపేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు

నాగ్‌కు నచ్చినపాట..!

కింగ్‌ నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘మన్మథుడు 2’ చిత్రంలోని రెండో పాట విడుదలైంది. ‘నాలోన...’ అంటూ సాగే ఈ పాటను నాగార్జున ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ఈ అందమైన పాట తనకెంతో నచ్చిందంటూ క్యాప్షన్‌ ఇచ్చారు

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.