close

తాజా వార్తలు

ఎంబీఏ చేసి హోటల్లో పని.. ఎందుకంటే..!

ముంబయి: ఇతరులకు ఆర్థికసాయం చేయడానికి ఎంతో మంది ముందుకొస్తారు. కానీ, తమ కాలాన్ని ఇతరుల కోసం కేటాయించాలంటే ముందు వెనకా ఆలోచిస్తుంటారు. అదే తెలియని వ్యక్తుల కోసం రోజూ ఆరు గంటల సమయాన్ని వెచ్చిస్తారా అంటే? నిర్మొహమాటంగా సాధ్యం కాదనే చెప్తారు. కానీ, ముంబయికి చెందిన ఓ యువ జంట ఒక వృద్ధురాలి కోసం రోజూ ఉదయం నాలుగు గంటల నుంచి 10 గంటల వరకు చిన్న హోటల్లో పనిచేస్తున్నారు. వారిద్దరూ ఎంబీఏ పూర్తి చేసి మంచి ఉద్యోగాల్లో స్థిరపడినవారే. దీపాలి అనే మహిళ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఈ యువ జంట గురించి పోస్ట్‌ చేయడంతో వారి సేవా గుణం బయటకు తెలిసింది. పోస్ట్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే దీనిపై పెద్దఎత్తున స్పందన వచ్చింది. 16వేల లైకులు, 2వేల కామెంట్లు వచ్చాయి. 

‘అత్యంత రద్దీగల ముంబయిలో మనం ఇతరుల గురించి పెద్దగా ఆలోచించలేం. కానీ, ఇద్దరు సూపర్‌హీరోలు ఇతరులకు చేసే సహాయాన్ని చూస్తే ఎవరైనా వారికి ఫిదా అవ్వాల్సిందే. అక్టోబర్ 2 తెల్లవారుజామున నేను మంచి ఆహారం కోసం వెతికాను. కండివాలి స్టేషన్‌ దగ్గర ఉన్న ఓ చిన్న హోటల్‌కు వెళ్లాను. అక్కడ అశ్విని, ఆమె భర్త పనిచేస్తున్నారు. అశ్విని జంట గుజరాత్‌కు చెందిన వారిలా కనిపించారు. నేను టిఫిన్‌ చేసిన తర్వాత ఇక్కడ హోటల్‌ ఎందుకు పెట్టారు? అని వారిని ప్రశ్నించాను. వారి సమాధానం విన్న తర్వాత ఒక్కసారిగా నా మనసు కదిలిపోయింది. వారిద్దరూ ఎంబీఏ పూర్తిచేశారు. మంచి కుటుంబం నుంచి వచ్చినవారు. కానీ, ఒక వృద్ధురాలి కోసం రోజూ ఉదయం నాలుగు గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్స్‌ అమ్ముతున్నారు. వృద్ధురాలి భర్తకి పక్షవాతం రావడంతో ఆమె చేసిన ఆహారాన్ని రోజూ  అమ్ముతున్నారు. దీంతో ఆ వృద్ధురాలికి ఆర్థికసహాయం కోసం ఇతరుల వద్ద చేయిచాచాల్సిన పరిస్థితి రాలేదు. ఇది విన్న తర్వాత వారిద్దరు నాకు ఎంతో ప్రేరణగా నిలిచారు’ అని పోస్ట్‌ చేసింది. దీంతో అశ్విని జంటపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘డబ్బుని ఎవరైనా దానం చేయగలరు, కానీ సమయాన్ని ఇతరుల కోసం ఎవరూ కేటాయించలేరు’, ‘మీరు చేసే సేవ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని కామెంట్లు పెడుతున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.