close

తాజా వార్తలు

హీరోగా వినాయక్‌.. ఫస్ట్‌లుక్‌ చూశారా?

హైదరాబాద్‌: విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు సినిమాలు ప్రచారం జోరు పెంచాయి. ఈ నేపథ్యంలో పలు సినిమా పోస్టర్లను విడుదల చేశారు. దర్శకుడు వి.వి వినాయక్‌ కథానాయడిగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘సీనయ్య’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. నరసింహా దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. బుధవారం వినాయక్‌ పుట్టినరోజు. ఇలా పండగను, ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని పోస్టర్‌ను విడుదల చేశారు.


సాయిపల్లవి మలయాళంలో నటించిన సినిమా ‘అథిరన్‌’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అనుకోని అతిథి’ టైటిల్‌తో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. దసరా శుభాకాంక్షలు చెబుతూ తెలుగు పోస్టర్లను విడుదల చేసింది. ఈ సినిమాకు వివేక్‌ దర్శకత్వం వహించారు.


శ్రీనివాసరెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్‌, సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. ఈ సినిమాకు శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పిస్తున్నారు. దసరా పండగ నేపథ్యంలో ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.


సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘తోలుబొమ్మలాట’. విశ్వనాథ్‌ మాగంటి దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు.


వర్ష, శివ కందకూరి జంటగా నటిస్తున్న చిత్రం ‘చూసీ చూడంగానే..’ శేష సింధురావు దర్శకుడు. ‘పెళ్లి చూపులు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన రాజ్‌ కందుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా నాయకనాయికల పరిచయ పోస్టర్‌ను చిత్ర బృందం ప్రేక్షకులతో పంచుకుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.