
తాజా వార్తలు
ముంబయి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సాధారణ చికిత్స నిమిత్తం గత కొన్నిరోజుల క్రితం ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి వెళ్లి వచ్చారు. అయితే అమితాబ్ తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారంటూ సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో అమితాబ్ సోషల్‌మీడియా వేదికగా తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్స్‌పై స్పందించారు. ‘ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వ్యక్తిగతంగా ఉంచుకోవడం అనేది ప్రతిఒక్కరి హక్కు. వేరొకరి ఆరోగ్యం గురించి తప్పుగా వార్తలు సృష్టించడం, వారి జీవితానికి భంగం కలిగించడం అనేది సామాజికంగా చట్టవిరుద్ధం. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రతిఒక్కరూ గౌరవించండి. అన్ని విషయాలను బయట ప్రపంచంతో పంచుకోలేము. నా మీద ప్రేమ చూపించిన వారితోపాటు నాకోసం పూజలు చేసిన ప్రతిఒక్కరికి నా ధన్యవాదాలు.’ అని బిగ్‌బి పేర్కొన్నారు.
ఇటీవల విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించారు. సైరా నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో ఆయన కనిపించారు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్లో తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర’, ‘జుంద్’, ‘గులాబో సితాబో’, ‘చెహ్రీ’ సినిమాలలో నటిస్తున్నారు. వీటితోపాటు మరోవైపు ఆయన రియాల్టీ షోలో కూడా చేస్తున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
