
తాజా వార్తలు
డీకే శివకుమార్
దిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. దిల్లీ హైకోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. రూ.25 లక్షల బాండుతో సహా ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు, విదేశాలకు వెళ్లకుండా షరతులు విధిస్తూ బెయిల్ ఇచ్చింది. బుధవారం రాత్రి 9:30గంటలకు ఆయనను తిహార్ జైలు నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా డీకే మీడియాతో మాట్లాడారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
‘మీ అందరి మద్దతు, ఆశీర్వాదంతో నాకు దిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మా పార్టీ నేతలు వెన్నంటి నిలిచారు. దేశవ్యాప్తంగా ఉన్న మా పార్టీ నేతలకు రుణపడి ఉంటాను. నేను తిరిగొచ్చాను. కష్టసమయాల్లో నాకు తోడుగా నిలిచినందుకు మీకు రుణపడి ఉంటాను. ముఖ్యంగా సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పాలి. ఆమె నన్ను పరామర్శించి ధైర్యం చెప్పారు’ అని తెలిపారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌లతో డీకే నేడు సమావేశం కానున్నారు. ఈరోజు దిల్లీలోనే ఉండి శుక్రవారం ఆయన బెంగళూరుకు చేరుకుంటారు.
డీకేపై దేవెగౌడ ట్వీట్..
డీకే విడుదల కావడంపై మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ హర్షం వ్యక్తం చేశారు. డీకేకు బెయిల్ ఇవ్వడంతో న్యాయస్థానాలపై ప్రజల్లో ఉన్న విశ్వాసం మరింత పెరిగిందని వెల్లడించారు. మరోవైపు దీనిపై సిద్ధరామయ్య కూడా స్పందించారు. డీకే శివకుమార్‌కు దిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయ కుట్రల కారణంగానే ఆయన్ను అరెస్టు చేశారని, ఇప్పుడు నిజమే గెలిచిందన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- క్రమశిక్షణతో ఉంటే జనసేన గెలిచేది:పవన్
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
- బాలయ్య సరసన రష్మి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
