
తాజా వార్తలు
ప్రశ్న: కొవ్వొత్తి పక్కనే టపాసు పేలితే అది ఆరిపోయింది. ఎందుకలా?
- యన్.లలితా కుమారి, పదో తరగతి, జడ్.పి.హెచ్.స్కూల్ అంబాజీపేట
ఏదైనా మండాలంటే మూడు విషయాలు అవసరం. ఇంధనం, ఆక్సిజన్, ఉష్ణం. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మంట రాదు. కొవ్వొత్తి విషయంలో మంట రావడానికి కారణం కొవ్వొత్తి వెంబడి కొవ్వు ఆవిరి రూపంలో ఇంధనంగా అందుతూ ఉంటుంది. మంటవల్ల వేడి అంటే ఉష్ణం అందుబాటులో ఉంటుంది. గాలిలోని ఆక్సిజన్ మండటానికి సహకరిస్తుంది.
* ఒక టపాసు మండుతున్న కొవ్వొత్తి దగ్గర్లో పేలడంతో అది బోలెడంత గాలిని సృష్టిస్తుంది. ఆ గాలి కొవ్వొత్తి గుండా అందుతున్న కొవ్వు ఆవిరిని తోసేసుకుంటూ తనలోకి లాగేస్తుంది. అంటే మండేందుకు కావాల్సిన కొవ్వు ఆవిరి అందుబాటులో ఉండదు.
* టపాసు పేలడంతో పరిసరాల్లో ఉండే ఆక్సిజన్ వాడేసుకుంటుంది. దాంతో మంట మండేందుకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. ఎప్పుడైతే ఇంధనం, ఆక్సిజన్ అదృశ్యమైపోయాయో మంట ఆరిపోతుంది.
- డాక్టర్ సి.వి. సర్వేశ్వర శర్మ, ప్రెసిడెంట్, కోనసీమ సైన్స్ పరిషత్, అమలాపురం
email: hb.eenadu @gmail.com
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- నలుదిశలా ఐటీ
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- యువతిపై అత్యాచారం.. ఆపై నిప్పు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
