close

తాజా వార్తలు

ఇమ్రాన్‌ ప్రకటనపై ప్రముఖుల స్పందన

దిల్లీ: వింగ్ కమాండర్‌ అభినందన్‌ను రేపు విడుదల చేస్తామని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటన చేయడంపై భారత నాయకులు, ప్రముఖులు స్పందించారు.

* పైలట్‌ కుటుంబంతో సహా, దేశం మొత్తం అతడి రాక కోసం ఎదురు చూస్తుంది- పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

* ఇది మంచివైపు పడిన ఒక ముందడుగు కానుంది- పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్.

* వింగ్ కమాండర్‌ అభినందన్‌ను అప్పగించాలన్నది మంచి ఆలోచన. దీన్ని సయోధ్యకు గుర్తుగా భావించవచ్చు. మన నాయకత్వం కూడా దానికి తగ్గట్టుగా స్పందించాలి- జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ.

* వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేస్తున్నారన్న వార్త చాలా సంతోషాన్ని కలిగించింది- జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.  

* అంతర్జాతీయ ఒత్తిడి, భారత్ దృఢవైఖరి వల్లే పాక్ చేతిలో బందీ అయిన పైలట్ తిరిగి వస్తున్నాడు- పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ.

* వింగ్ కమాండర్‌ అభినందన్‌ రేపు అతడి కుటుంబాన్ని కలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను. అతడి ధైర్య సాహసాలకు దేశం గర్విస్తుంది-దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.