close

తాజా వార్తలు

స్పార్‌ల్యాబ్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

జిన్నారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్పార్‌ల్యాబ్‌ సాల్వెంట్‌ రికవరీ పరిశ్రమలో మధ్యాహ్నం కార్మికులు భోజనం చేస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. అనంతరం పక్క పరిశ్రమకు కూడా ఈ మంటలు వ్యాపించాయి. రసాయనాలపై నీళ్లు పడటంతో మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం  వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తంచేస్తున్నారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.