Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001045
            [news_title_telugu_html] => 

నాలుగేళ్ల తర్వాత హత్యగా తేలిన రోడ్డుప్రమాదం

[news_title_telugu] => నాలుగేళ్ల తర్వాత హత్యగా తేలిన రోడ్డుప్రమాదం [news_title_english] => kurnool police revealed murder mystery [news_short_description] => నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదాన్ని పోలీసులు హత్యగా తేల్చారు. ఈ ఘటన కర్నూలు జిల్లా అవుకు మండలంలో చోటుచేసుకుంది.... [news_tags_keywords] => crime,kurnool [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => ShDnmO4ueCc [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 14:10:38 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నాలుగేళ్ల తర్వాత హత్యగా తేలిన రోడ్డుప్రమాదం - kurnool police revealed murder mystery - EENADU
close

తాజా వార్తలు

నాలుగేళ్ల తర్వాత హత్యగా తేలిన రోడ్డుప్రమాదం

ఇన్సూరెన్స్‌ సొమ్ము కోసం యాజమాని దురాగతం

అవుకు: నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదాన్ని పోలీసులు హత్యగా తేల్చారు. ఈ ఘటన కర్నూలు జిల్లా అవుకు మండలంలో చోటుచేసుకుంది. ఇన్సూరెన్స్‌ సొమ్ము కోసమే సుబ్బారాయుడు అనే వ్యక్తిని నలుగురు కలిసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు కేసు వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. 

2015లో బనగానపల్లె సమీపంలోని అవుకు వద్ద వడ్డే సుబ్బారాయుడు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే దీనిని సుబ్బారాయుడి యజమాని భాస్కర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. పోలీసులు కూడా రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేసుకున్నారు. అయితే నాలుగేళ్ల తర్వాత  సుబ్బారాయుడి హత్యపై తాజాగా పోలీసులకు కీలక సమాచామందింది. గుర్తు తెలియని వ్యక్తులు సుబ్బారాయుడిని హత్య చేశారని కొందరు వ్యక్తులు పోలీసులకు తెలిపారు. దీంతో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. దీంతో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇన్సూరెన్స్‌ సొమ్ము కోసమే సొంత యజమానే ఈ హత్య చేయించి అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు వెల్లడైంది. నా అనే వాళ్లు లేని పనిమనిషి సుబ్బాయుడిపై భాస్కర్‌రెడ్డి రూ.32 లక్షల ఇన్సూరెన్స్‌ చేయించాడని.. సుబ్బారాయుడి మరణంతో యజమాని ఆ బీమా సొమ్మును కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.