
తాజా వార్తలు
తాగునీరు పట్టుకుని రైలు ఎక్కుతూ జారిపడిన ప్రయాణికుడు
గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి
రాజమహేంద్రవరం నగరం: తాగునీటి కోసం రైలు దిగి తిరిగి ఎక్కే క్రమంలో జారిపడిన ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో బుధవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీస్‌స్టేషన్ ఎస్సై మావుళ్లు తెలిపిన వివరాల మేరకు దిబ్రూఘడ్ - తామ్రం (నంబరు 15930) ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.03 గంటలకు స్టేషన్‌కు వచ్చిందన్నారు. ఆ సమయంలో సాధారణ బోగీలోని ఓ ప్రయాణికుడు తాగునీటిని పట్టుకునేందుకు ప్లాట్‌ఫాంపైకి దిగాడు. రైలు బయలు దేరుతుండటంతో కంగారుపడుతూ బండి ఎక్కే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో గుమ్మానికి ఉన్న ఇనుపకడ్డీని బలంగా ఢీకొని కింద పడిపోయాడు. స్టేషనులో ప్రథమ చికిత్స నిర్వహించి, అతడిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రయాణికుడి వివరాలు తెలియరాలేదని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- ఉతికి ఆరేశారు
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
