close

తాజా వార్తలు

కాబూల్‌లో బాంబు పేలుళ్లు

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. గురువారం జరిగిన ఈ పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, మరో 23 మందికి గాయాలయ్యాయని అఫ్గాన్‌ ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. పలు ప్రాంతాల్లో పెర్షియన్‌ నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటున్న సందర్భంగా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. ఈ వేడుకలు అక్కడి మత సంప్రదాయాలకు వ్యతిరేకమనే భావజాలం కారణంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. పశ్చిమ కాబూల్‌లోని కర్త్‌ ఎ సాఖి ప్రార్థన మందిరం సమీపంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. కొందరు మోర్టార్‌ బాంబులతో దాడులకు దిగారని అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఈ దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. అక్కడి పరిస్థితులను అదుపులోకి తెచ్చినట్లు చెప్పింది. బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో భద్రతా బలగాలు మోహరించాయి. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకూ ఏ ఉగ్ర సంస్థ ప్రకటన చేయలేదు. అయితే, గతంలో షియా ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్ర సంస్థ దాడులు జరిపింది. తాజా దాడులు కూడా ఆ సంస్థే‌ జరిపినట్లు తెలుస్తోంది. కాబూల్‌లోని మూడు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు సమాచారం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.