Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 112851
            [news_title_telugu_html] => 

పాక్‌తో.. కుల్‌దీప్‌కి బదులు మహ్మద్‌ షమీ!

[news_title_telugu] => పాక్‌తో.. కుల్‌దీప్‌కి బదులు మహ్మద్‌ షమీ! [news_title_english] => Team India will move with three pacers with Pakistan [news_short_description] => ప్రపంచకప్‌ ప్రారంభమైన నాటి నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. భారత్‌ X పాకిస్థాన్‌ సమరానికి మరికొద్ది గంటలే సమయముంది. ... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-16 13:20:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పాక్‌తో.. కుల్‌దీప్‌కి బదులు మహ్మద్‌ షమీ! - Team India will move with three pacers with Pakistan - EENADU
close

తాజా వార్తలు

పాక్‌తో.. కుల్‌దీప్‌కి బదులు మహ్మద్‌ షమీ!

విజయ్‌శంకర్‌ అరంగేట్రం నేడు

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌ ప్రారంభమైన నాటి నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. భారత్‌ X పాకిస్థాన్‌ సమరానికి మరికొద్ది గంటలే సమయముంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లను ఓడించిన కోహ్లీసేన ఇప్పుడు పాకిస్థాన్‌పై కన్నేసింది. ఛాంపియన్స్‌ ట్రోఫీకి బదులు తీర్చుకోడంతో పాటు ప్రపంచకప్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. 

ఈ నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లకి బదులు ఒకరితోనే బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తోంది. కుల్‌దీప్‌కి బదులు మహ్మద్‌ షమీని తీసుకునే అవకాశం ఉంది. దీంతో ముగ్గురు పేసర్లు ఇవాళ పాక్‌ని ఏ మేరకు కట్టడి చేస్తారో చూడాలి. ఈ విషయంపై హర్భజన్‌ స్పందిస్తూ.. పాకిస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటారు కాబట్టి ఇద్దరు స్పిన్నర్లతో దిగడం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. 

ఇదిలా ఉండగా మిడిలార్డర్‌లో ఆల్‌రౌండర్‌ విజయ్‌శంకర్‌ నేటి మ్యాచ్‌తో ప్రపంచకప్‌లో అరంగేట్రం చేయనున్నాడు. శిఖర్‌ధావన్‌ గాయం కారణంగా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో నాలుగో నంబర్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌.. రోహిత్‌శర్మతో కలిసి ఓపెనింగ్‌ చేస్తాడు. దీంతో నాలుగో నంబర్‌గా విజయ్‌కి ఈ మ్యాచ్‌ ఆడే అవకాశం వచ్చింది. కాగా ఆదివారం ఉదయం నాటికి పరిస్థితులను బట్టి జట్టులో మార్పులుంటాయని కోహ్లీ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.