Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146203
            [news_title_telugu_html] => 

స్మిత్‌ను అనుకరించిన ఆర్చర్‌

[news_title_telugu] => స్మిత్‌ను అనుకరించిన ఆర్చర్‌ [news_title_english] => Jofra Archer Batting like Steve smith at net practise [news_short_description] => ఇంగ్లాండ్‌ X ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు సందర్భంగా జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో స్టీవ్‌స్మిత్‌ గాయపడిన విషయం తెలిసిందే. మెడపై తీవ్ర గాయమవడంతో... [news_tags_keywords] => Jofra Archer ,Steve Smith,ENGvsAUS,Ashes Series [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1164334456275996673 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 22:52:48 [news_isactive] => 1 [news_status] => 2 ) )
స్మిత్‌ను అనుకరించిన ఆర్చర్‌ - Jofra Archer Batting like Steve smith at net practise - EENADU
close

తాజా వార్తలు

స్మిత్‌ను అనుకరించిన ఆర్చర్‌

అతడిలా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ పేసర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ X ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు సందర్భంగా జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో స్టీవ్‌స్మిత్‌ గాయపడిన విషయం తెలిసిందే. మెడపై తీవ్ర గాయమవడంతో అతడు మూడో టెస్టుకు దూరమయ్యాడు. కాగా స్మిత్‌ గాయపడకముందు ఇంగ్లాండ్‌ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో కొన్ని బంతులను వదిలిన తీరు అభిమానులు నవ్వులు పూయించింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో సైతం తెగ వైరల్‌ అయింది. స్మిత్‌ గాయపడ్డాక తిరిగి బ్యాటింగ్‌ చేసినా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. గాయం తీవ్రం కావడంతో స్మిత్‌కు బదులు కంకషన్‌ ప్లేయర్‌గా వచ్చిన లబూషేన్‌(59) మ్యాచ్‌ను డ్రా వైపు తీసుకెళ్లాడు.  

ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిశాక ఇరు జట్లూ మూడో టెస్టు కోసం లీడ్స్‌ మైదానానికి చేరుకొని ప్రాక్టీస్‌ మొదలెట్టాయి‌. ఈ సందర్భంగా ఇంగ్లాండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌.. స్టీవ్‌స్మిత్‌ బ్యాటింగ్‌ శైలిని అనుకరిస్తూ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశాడు. అచ్చం ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌లాగే స్ట్రెయిట్‌డ్రైవ్‌లు ఆడడంతో పాటు రెండో టెస్టులో స్మిత్‌ వదిలేసిన కొన్ని బంతులను అనుకరించాడు. అందుకు సంబంధించిన వీడియోను ఓ క్రీడా ఛానెల్‌ పోస్టు చేయగా.. అక్కడ బ్యాటింగ్‌ చేసింది ఆసీస్‌ బ్యాట్స్‌మనా లేక ఆర్చరా అని అంతా ఆశ్చర్యపోతున్నారు! మరోవైపు అరంగేట్రం మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసిన ఆర్చర్‌ ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. మరోవైపు గురువారం వర్షం కారణంగా మూడో టెస్టు ఆలస్యమైంది. 

 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.