Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000444
            [news_title_telugu_html] => 

పతకం మీద కాదు..ఆట మీదే దృష్టి

[news_title_telugu] => పతకం మీద కాదు..ఆట మీదే దృష్టి [news_title_english] => Focus on semi final can talk about medal later [news_short_description] => తెలుగు కుర్రాడు సాయి ప్రణీత్‌ ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో అదరగొడుతున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో 24-22, 21-14తో నాలుగో సీడ్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)పై సంచలన విజయం నమోదు చేశాడు....... [news_tags_keywords] => BWF World Championships,Sai Praneeth [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 09:05:58 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పతకం మీద కాదు..ఆట మీదే దృష్టి - Focus on semi final can talk about medal later - EENADU
close

తాజా వార్తలు

పతకం మీద కాదు..ఆట మీదే దృష్టి

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయిప్రణీత్‌

బసెల్‌: తెలుగు కుర్రాడు సాయి ప్రణీత్‌ ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో అదరగొడుతున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో 24-22, 21-14తో నాలుగో సీడ్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)పై సంచలన విజయం నమోదు చేశాడు. అద్భుత ప్రదర్శనతో పతకం ఖాయం చేసుకుని 36 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించాడు. ఈ సందర్భంగా ప్రణీత్ మీడియాతో మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

‘చాలా అద్భుతంగా అనిపిస్తోంది. గొప్పగా ఫీలవుతున్నా. ఈ గెలుపుతో చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఇంకా కొన్ని మ్యాచులున్నాయి. వాటి మీదే దృష్టి పెట్టాలి. తర్వాతి మ్యాచ్‌ మీదే ప్రస్తుతం నా ఆలోచనలన్నీ తిరుగుతున్నాయి. పతకం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం’ అని చెప్పాడు. ప్రణీత్‌ ప్రస్తుతం 19వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఈ ఏడాదే ఇతడికి ‘అర్జున’ అవార్డు కూడా వచ్చింది. ఈ ఏడాది స్విస్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి.. జపాన్‌ ఓపెన్‌లో సెమీస్‌ చేరుకున్నాడు. ఇక పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్‌ పదుకొణె 1983లో కాంస్య పతకం సాధించాడు. ఇప్పుడు మళ్లీ సాయి ప్రణీత్‌కు పతకం తెచ్చే అవకాశం వచ్చింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.