Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009276
            [news_title_telugu_html] => 

నితీశ్‌కు మద్దతుగాట్వీట్‌.. అంతలోనే డిలీట్

[news_title_telugu] => నితీశ్‌కు మద్దతుగాట్వీట్‌.. అంతలోనే డిలీట్ [news_title_english] => Sushil Modi Deletes Tweet Supporting Nitish Kumar for Bihar CM in 2020 Assembly Election [news_short_description] => భాజపా సీనియర్‌ నేత, బిహార్‌ ఉపముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ చేసిన ఒక ట్వీట్‌ రాజకీయ దుమారం లేపడంతో కొద్దిసేపటికే ఆయన దాన్ని తొలగించారు.  బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కు ఆయన మద్దతు పలకడమే వివాదానికి దారితీసింది. [news_tags_keywords] => bihar,sushil kumar modi,bjp,jdu,nithish kumar ,twitter [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 23:01:07 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నితీశ్‌కు మద్దతుగాట్వీట్‌.. అంతలోనే డిలీట్ - Sushil Modi Deletes Tweet Supporting Nitish Kumar for Bihar CM in 2020 Assembly Election - EENADU
close

తాజా వార్తలు

నితీశ్‌కు మద్దతుగాట్వీట్‌.. అంతలోనే డిలీట్

పాట్నా: భాజపా సీనియర్‌ నేత, బిహార్‌ ఉపముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ చేసిన ఒక ట్వీట్‌ రాజకీయ దుమారం లేపడంతో కొద్దిసేపటికే ఆయన దాన్ని తొలగించారు.  బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కు ఆయన మద్దతు పలకడమే అందుకు కారణం. ‘బిహార్‌ ఎన్డీయే కూటమికి నితీష్‌ కుమారే నాయకుడు. 2020 శాసనసభ ఎన్నికలకు కూడా ఎన్డీయే తరఫున ఆయనే నాయకత్వం వహిస్తారు’ అంటూ ఆయన ఇటీవల ట్వీట్‌ చేశారు. దీంతో ఆ ట్వీట్‌ కాస్తా భాజపా వర్గాల్లో రాజకీయంగా దుమారం లేపింది. పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. ముఖ్యమంత్రి పదవి భాజపాకే కావాలంటూ కొందరు నాయకులు డిమాండు చేయడంతో ట్వీట్‌ను కొద్ది సేపటికే ఖాతా నుంచి తొలగించారు. 

ఇటీవల భాజపా సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సంజయ్‌ పాసవాన్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘నితీష్‌కుమార్‌ హయాంలో బిహార్‌లో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా అదుపులో ఉన్నాయి. అయినప్పటికీ భాజపా లేదా జేడీయూల నుంచి రెండో తరం నాయకులకు అవకాశం ఇవ్వడానికి ఆయన కేంద్ర రాజకీయాల్లోకి రావాలి’ అని అన్నారు. మరో భాజపా నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సీపీ ఠాకూర్‌ సైతం ప్రస్తుతం బిహార్‌ ముఖ్యమంత్రి పదవికి భాజపానే అర్హత కలిగిఉందని అన్నారు. ఇదిలా ఉండగా జేడీయూ వర్గాలు మాత్రం 2020 ఎన్నికల తర్వాత ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే నితీష్‌కుమార్‌నే ముఖ్యమంత్రిని చేయాలని కోరుతుండటం గమనార్హం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.