Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 113243
            [news_title_telugu_html] => అమ్మో.. ప్యానల్‌ బోర్డా!
            [news_title_telugu] => అమ్మో.. ప్యానల్‌ బోర్డా!
            [news_title_english] => 
            [news_short_description] => గ్రేటర్‌లో విద్యుత్తు ప్యానల్‌ బోర్డు కనెక్షన్లు వేలల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ముడుపులిస్తే తప్ప ముందుకుసాగడం లేదు. దరఖాస్తుదారుల నుంచి కింది నుంచి పై స్థాయి వరకు కొందరు 

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => ||
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-06-17 09:09:23
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
అమ్మో.. ప్యానల్‌ బోర్డా! - EENADU
close

తాజా వార్తలు

అమ్మో.. ప్యానల్‌ బోర్డా!

వేలల్లో దరఖాస్తులు పెండింగ్‌
డిస్కంలో నెలల తరబడి అపరిష్కృతం
ముడుపులిస్తేనే కదలిక..
పై అధికారి చెబితే లంచంలో రాయితీ
ఈనాడు, హైదరాబాద్‌

గ్రేటర్‌లో విద్యుత్తు ప్యానల్‌ బోర్డు కనెక్షన్లు వేలల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ముడుపులిస్తే తప్ప ముందుకుసాగడం లేదు. దరఖాస్తుదారుల నుంచి కింది నుంచి పై స్థాయి వరకు కొందరు సిబ్బంది ఇష్టారీతిగా దండుకుంటున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నా నిర్దేశించిన ధరల ప్రకారం సొమ్ము ఇస్తేనే దస్త్రం ముందుకు కదులుతుంది. తక్కువలో తక్కువ రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు దరఖాస్తుదారు నుంచి లాగుతున్నారు. ఈ దందాపై తరచూ ఫిర్యాదులు అందుతున్నా డిస్కం యాజమాన్యం గట్టిగా చర్యలు తీసుకోలేకపోతోంది. ఉన్నతాధికారులు చెబితే లంచంలో రాయితీ ఇస్తున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

గృహ, వాణిజ్య సముదాయం ఏదైనా నాలుగు విద్యుత్తు కనెక్షన్లకు మించితే భద్రత దృష్ట్యా విధిగా ప్యానల్‌ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిబంధనే అక్రమార్కుల పంట పండిస్తోంది. నాలుగు మించి కనెక్షన్లు ఉంటే సమీపంలోని విద్యుత్తు స్తంభం నుంచి అన్ని తీగలు లాగడం ప్రమాదకరం. భద్రత రీత్యా నిర్మాణ ప్రాంగణంలోనే ఒక బోర్డు ఏర్పాటు చేసి అక్కడ మీటర్లు అమర్చుతారు. విద్యుత్తు స్తంభం నుంచి బోర్డుకు కనెన్షన్‌ ఇస్తారు. నిర్మాణాలు ఎక్కువగా జరిగే శివార్లలో వినియోగదారులు ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటున్నారు.

ప్రతి దశలో చేయి తడపాల్సిందే..
కనెక్షన్‌ కోసం వినియోగదారుల సేవా కేంద్రంలో మొదట దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడే కొందరు దళారులు తిష్ఠ వేస్తున్నారు. వీరు కేవలం ప్యానల్‌ బోర్డు కనెక్షన్లు మాత్రమే చేపడతారు. సాధారణంగా దళారులు బయటివారు ఉంటే.. డిస్కంలో సిబ్బందే దళారుల అవతారం ఎత్తుతారు. వీరు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తూ వినియోగదారుల నుంచి దోచుకుంటున్నారు.

* వినియోగదారుల సేవా కేంద్రం నుంచి దరఖాస్తు సంబంధిత సెక్షన్‌ ఏఈకి వెళుతుంది. వీరు అంచనాలు రూపొందిస్తారు. ఈ పనిచేయాలంటే చాలా సెక్షన్లలో రూ.10 వేలు ఇవ్వాల్సిందే. అంచనా వేసే సబ్‌ ఇంజినీర్‌కు రూ.2 వేలు ముట్టజెప్పాలి. అక్కడి నుంచి ఏడీఈకి వెళుతుంది. ఆయన ఓ లేఖ ఇస్తారు. ఇక్కడ మరో రూ.పదివేలు సమర్పించుకోవాలి. ఇక్కడ ఉండే సబ్‌ఇంజినీర్‌కు రూ.2వేలు, ఆపరేటర్‌కు రూ.వెయ్యిగా ధర నిర్ణయించారు. ఇక్కడి నుంచి డీఈ వద్దకు దస్త్రం వెళుతుంది. ఆయన అనుమతికి రూ.పది వేలు నిర్ణయించారు. అనుమతి సమాచారం వినియోగదారుకు చేరగానే.. వినియోగదారుల సేవా కేంద్రంలో సొమ్ములు చెల్లించాల్సి ఉంటుంది. సొమ్ములు చెల్లించగానే ఏఈ వర్క్‌ఆర్డర్‌ రాసి ఇస్తారు. ఏడీఈ కౌంటర్‌ సిగ్నేచర్‌ చేస్తారు. ఎస్‌ఈ వర్క్‌ఆర్డర్‌ ఇస్తారు. ఇక్కడ కూడా ముడుపులు ఇవ్వాల్సిందే అంటున్నారు వినియోగదారులు. ఆర్డర్‌ తీసుకుని స్టోర్‌కు వెళితే సామగ్రి ఇస్తారు. ఇండోర్‌ స్టోర్‌ నుంచి మీటర్లు ఇస్తారు. ఒక్కో మీటర్‌కు రూ.500 ఇవ్వాలి. అవుట్‌డోర్‌ స్టోర్‌ నుంచి తీగలు, ట్రాన్స్‌ఫార్మర్‌ వంటి సామగ్రి అందజేస్తారు. వీరికి సామగ్రి విలువను బట్టి రూ.2వేల నుంచి రూ.3 వేల వరకు ఇవ్వాలి. అంచనాలో పేర్కొన్న పనులన్నీ కాంట్రాక్టర్‌ పూర్తిచేశాక ఏఈ, ఏడీఈ తనిఖీ చేస్తారు. తనిఖీకి రావాలంటే మరో రూ.పదివేలు సమర్పించుకోవాలి. వీరు తనిఖీల అనంతరం నివేదికకు డీఈకి ఇస్తే.. పని పూర్తయినట్లు నివేదిక ఇవ్వడానికి ఇంకో రూ.పదివేలు ఇచ్చుకోవాలి. సరఫరా ఇవ్వాలనే ఆదేశాలు అక్కడి నుంచి ఏడీఈకి, ఏఈకి వస్తాయి. ఇక్కడ రూ.పదివేలు ముట్టజెప్పాల్సిందే. అక్కడి నుంచి లైన్‌ఇన్‌స్పెక్టర్‌కు రూ.ఐదు వేలు ఇవ్వందే సరఫరా ఇవ్వడు. లైన్‌మెన్లు, ఇతర సిబ్బందికి ఎంతోకొంత ఇవ్వాలి. కొంతమంది సిబ్బంది, అధికారులు నిజాయితీగా పనిచేస్తున్నా.. అధికశాతం ఇంజినీర్లు ఆ రోజు ఎన్ని అంచనాలు ఇచ్చాం.. ఎంత వచ్చిందనే లెక్కలు వేసుకుంటున్నారు. వీరి పేరు చెప్పి దళారులు మరింత దండుకుంటున్నారు. పారదర్శకత లేకపోవడమే డిస్కంలో విచ్చలవిడిగా అవినీతి సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

నిబంధనల పేరుతో..
అన్నీ సక్రమంగా ఉంటేనే దశలవారీగా దండుకుంటున్న కొందరు.. నిబంధనల ప్రకారం లేనివి వస్తే గంపగుత్తగా ధర చెబుతున్నారు. 10మీటర్ల ఎత్తుదాటిన భవనాలకు జీహెచ్‌ఎంసీ నుంచి అక్యుపెన్సీ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. లేకున్నా రూ.లక్షల్లో దండుకుని కనెన్షన్లు ఇస్తున్నారు. దరఖాస్తుదారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి వదిలేస్తే ఎన్నిరోజులైనా కనెన్షన్‌ రాదు. వచ్చి సంబంధిత సిబ్బందిని కలిస్తే ఇవ్వాల్సింది ఇస్తే చకచకా పనవుతుంది. సొమ్ము అందకపోతే ఎన్నిరోజులైనా పెండింగ్‌లోనే ఉంటాయి.
* నాలుగు సర్కిళ్ల పరిధిలో దరఖాస్తులను పరిశీలిస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా గడువులోపు కనెన్షన్‌ మంజూరు చేయలేదు.
* అవినీతి ఆరోపణలు ఎక్కువగా విన్పించే సైబర్‌సిటీ సర్కిల్‌లో 955 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క కనెక్షన్‌ సమయానికి ఇవ్వలేదు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.