close

తాజా వార్తలు

అమ్మా..అపూర్వా!..ఎంతటి మార్పు?

జైల్లో విచిత్రంగా నడుచుకుంటున్న రోహిత్‌ తివారీ భార్య

దిల్లీ: ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్‌ శేఖర్‌ తివారీ హత్యకు గురయిన విషయం తెలిసిందే. రోహిత్‌ను ఆయన భార్య అపూర్వ శుక్లా ఏప్రిల్‌ 15న హతమార్చింది. ఈ కేసు విషయంలో ఇప్పుడామె తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తోంది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఈమె..జైల్లో తన ప్రవర్తనతో అక్కడి వారిని విస్మయానికి గురి చేస్తోంది. తీహార్‌ జైల్లో ఈమె టారో కార్డులను చదవడం నేర్చుకుంటోందని జైలు సూపరింటెండెంట్‌ డా. సింగ్‌ తెలిపారు. జైల్లో ఉన్న వారికి పునరావాసం కల్పించడానికి అక్కడి అధికారులు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న వాళ్లకు వారంలో రెండు రోజుల పాటు టారో కార్డులను చదవడం నేర్పిస్తున్నారు. అయితే వీటిని చదవడానికి అపూర్వ అమితాసక్తి చూపిస్తోందట. ఇప్పటి వరకు 7సెషన్లు జరగ్గా అందులో 15 కార్డులను చదవడం నేర్చుకుందట. ప్రశాంతంగా ఉండేందుకు యోగా వంటివి కూడా చేస్తోందట.

జైల్లో ఈమె నడవడిక అక్కడున్న అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోందని అక్కడి జైలర్లు చెబుతున్నారు. భర్తను చంపామన్న పశ్చాత్తాపం కొంచెం కూడా ఆమెలో కనిపించడం లేదు. ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకుండా అందరినీ నవ్వుతూ పలకరిస్తోందని వారు తెలిపారు. తన భర్త గురించి ఎప్పుడు ప్రస్తావించినా ‘ఇందులో బాధపడాల్సిన విషయమేమీ లేదు. అదంతా నా తలరాత’ అంటూ వేదాంతం మాట్లాడుతోందట. జైలుకు వచ్చిన మొదట్లో ఫైర్‌బ్రాండ్‌లాగా కనిపించిన ఈమెలో చాలా మార్పు వచ్చిందని జైలు అధికారుల తెలుపుతున్నారు.
 

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.