Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142001
            [news_title_telugu_html] => 

9 ఏళ్ల వయసుకే.. కిలిమంజారోను అలవోకగా..!

[news_title_telugu] => 9 ఏళ్ల వయసుకే.. కిలిమంజారోను అలవోకగా..! [news_title_english] => After Mount Everest 9Year Old Pune Boy Climbs Africas Highest Mountain [news_short_description] => ఆ బాలుడి వయసు తొమ్మిదేళ్లే కానీ అతడు సాధించిన విజయాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అతడు సాధించింది సాధారణ విజయాలు కాదు. ఆరేళ్ల వయసులోనే ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాడు. [news_tags_keywords] => advaith bhartia,kilimanjaro trek,nine years old [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-15 00:19:56 [news_isactive] => 1 [news_status] => 2 ) )
9 ఏళ్ల వయసుకే.. కిలిమంజారోను అలవోకగా..! - After Mount Everest 9Year Old Pune Boy Climbs Africas Highest Mountain - EENADU
close

తాజా వార్తలు

9 ఏళ్ల వయసుకే.. కిలిమంజారోను అలవోకగా..!

దిల్లీ: ఆ బాలుడి వయసు తొమ్మిదేళ్లు. కానీ అతడు సాధించిన విజయాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అతడు సాధించింది సాధారణ విజయాలు కాదు. ఆరేళ్ల వయసులోనే ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాడు. మళ్లీ ఇప్పుడు తొమ్మిదేళ్ల వయసుకే ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన కిలిమంజారో అధిరోహించి భారత కీర్తి ప్రతిష్ఠలు చాటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

పుణెకు చెందిన అద్వైత్‌ భార్తియా(9) ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని (19,341అడుగులు) అధిరోహించి చరిత్ర సృష్టించాడు. లిటిల్‌ సింబా(చిన్న సింహం)గా పేరు సాధించిన ఈ బాలుడు తన శిక్షకుడు సమీర్‌ పాతమ్‌ పర్యవేక్షణలో జులై 31న పర్వతాన్ని అధిరోహించాడు. ఈ సందర్భంగా అద్వైత్‌ మాట్లాడుతూ.. కిలిమంజారో అధిరోహించడం మంచి అనుభవాన్ని ఇచ్చిందన్నాడు. వచ్చే ఏడాది యూరప్‌లో అత్యంత ఎత్తైన పర్వతాలైన ఎల్బర్స్‌ ఎక్కనున్నట్లు తెలిపాడు. అద్వైత్ తల్లి పాయల్‌ భార్తియా మాట్లాడుతూ.. పర్వతారోహణ కోసం అద్వైత్‌ రెండు నెలల పాటు శిక్షణ తీసుకున్నాడన్నారు. నిత్యం ఒక గంట ఈత, ఆ తర్వాత ఫుట్‌బాల్‌, క్రికెట్‌, టెన్నిస్‌ వంటి ఆటలతో పాటు వంద అంతస్తులను ఎక్కడం లాంటి సాహస కృత్యాలు చేస్తాడని తెలిపారు. పర్వతారోహణ చేయడంలో అద్వైత్‌కు ఉన్న అంకితభావానికి తానెంతో గర్విస్తున్నానని ఆమె తెలిపారు. పుణెకు చెందిన అడ్వెంచర్‌ పల్స్‌ అనే సంస్థ ఈ పర్వతారోహణ ఈవెంట్‌ను నిర్వహించింది. అద్వైత్‌ 2016లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాడు. ఎవరెస్ట్‌ అధిరోహించిన సమయంలో అద్వైత్‌ వయసు కేవలం ఆరు సంవత్సరాలే కావడం విశేషం.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.