Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144096
            [news_title_telugu_html] => 

ఆనందానికి మారుపేరు భూటాన్‌

[news_title_telugu] => ఆనందానికి మారుపేరు భూటాన్‌ [news_title_english] => Bhutan is the nickname for happiness [news_short_description] => సంతోషంలోని సారాంశాన్ని భూటాన్‌ అర్థం చేసుకొందని, అందుకనే అది ఆనందానికి పర్యాయపదంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ కారణంగానే ప్రపంచానికి స్థూల జాతీయ ఆనందం (గ్రాస్‌ నేషనల్‌ హ్యాపీనెస్‌) అనే భావనను అందించిందని చెప్పారు. [news_tags_keywords] => bhutan ,happiness,modi,nick name [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 23:36:51 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆనందానికి మారుపేరు భూటాన్‌ - Bhutan is the nickname for happiness - EENADU
close

తాజా వార్తలు

ఆనందానికి మారుపేరు భూటాన్‌

 ప్రధాని మోదీ ప్రశంస

థింపు: సంతోషంలోని సారాంశాన్ని భూటాన్‌ అర్థం చేసుకొందని, అందుకనే అది ఆనందానికి పర్యాయపదంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ కారణంగానే ప్రపంచానికి స్థూల జాతీయ ఆనందం (గ్రాస్‌ నేషనల్‌ హ్యాపీనెస్‌) అనే భావనను అందించిందని చెప్పారు. రెండు రోజులుగా ఆ దేశంలో పర్యటిస్తున్న మోదీ ఆదివారం రాయల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ భూటాన్‌ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అసాధ్యాలను సాధించే శక్తిసామర్థ్యాలు ఆ దేశ యువతకు ఉన్నాయని, ఇవి తప్పకుండా భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని చెప్పారు. ఇరుగుపొరుగున ఉండడం ద్వారా మాత్రమే కాకుండా చరిత్ర, సాంస్కృతికంగా కూడా ఇరుదేశాలు సన్నిహిత, సహజ మిత్రులని అభివర్ణించారు. ఈ సమావేశంలో ఆ దేశ ప్రధాని లొటాయ్‌ ఛెరింగ్‌ పాల్గొన్నారు. భూటాన్‌ పర్యటన అనంతరం ప్రధాని మోదీ తిరిగి దిల్లీ చేరుకున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.