Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145042
            [news_title_telugu_html] => 

నా భార్య చేసే లడ్డూలు తినలేను:విడాకులివ్వండి

[news_title_telugu] => నా భార్య చేసే లడ్డూలు తినలేను:విడాకులివ్వండి [news_title_english] => UP Man Files for Divorce After Wife Feeds Him Laddoos [news_short_description] => ఓ మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని తాంత్రికుడు ఇచ్చిన సలహా ఆమె భర్తను కోర్టు మెట్లెక్కెలా చేసింది. [news_tags_keywords] => Tantrik,UP Man , Divorce , Laddoos [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 00:13:56 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నా భార్య చేసే లడ్డూలు తినలేను:విడాకులివ్వండి - UP Man Files for Divorce After Wife Feeds Him Laddoos - EENADU
close

తాజా వార్తలు

నా భార్య చేసే లడ్డూలు తినలేను:విడాకులివ్వండి

మేరఠ్‌: ఓ మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని తాంత్రికుడు ఇచ్చిన సలహా ఆమె భర్తను కోర్టు మెట్లెక్కెలా చేసింది. విడాకుల దరఖాస్తులో అతడు వివరించిన కారణం చూసి ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ జిల్లాలో ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

భర్తకు అనారోగ్యం రావడంతో దాన్ని నయం చేయడానికి మేరఠ్‌కు చెందిన మహిళ తాంత్రికుడిని ఆశ్రయించింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న తాంత్రికుడు.. లడ్డూలు మాత్రమే అతడి అనారోగ్యాన్ని నయం చేస్తాయని సలహా ఇచ్చాడు. దాన్ని గుడ్డిగా నమ్మిన మహిళ ఉదయం, సాయంత్రం రోజుకు రెండు పూటల నాలుగు లడ్డూలు మాత్రమే భర్తకు ఆహారంగా ఇచ్చేది. అతడు ఎంత వేడుకున్నా వేరే ఆహారాన్ని ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీరించేది కాదు. ఆమె తీరుతో విసుగెత్తిన భర్త ఈ విచిత్ర కారణాన్ని చూపి, ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఈ కారణం తెలుసుకున్న ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అధికారులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. వెంటనే వారిద్దరికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ‘వారికి మేం కౌన్సిలింగ్ ఇవ్వనున్నాం. లడ్డూలే ఆమె భర్త అనారోగ్యాన్ని తగ్గిస్తాయని ఆమె భావిస్తోంది. దేన్నీ ఆమె అంగీకరించే స్థితిలో లేదు’ అని వారు వెల్లడించారు. ఆ దంపతులకు 10 సంవత్సరాల క్రితమే వివాహమైంది. వారికి ముగ్గురు సంతానం కూడా ఉన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.