Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145496
            [news_title_telugu_html] => 

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన

[news_title_telugu] => పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [news_title_english] => invigilator misbehave with student in exam hall [news_short_description] => ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌    [news_tags_keywords] => crime,karimnagar [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 06:59:34 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన - invigilator misbehave with student in exam hall - EENADU
close

తాజా వార్తలు

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన

 

తిమ్మాపూర్‌, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌     కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని.. సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు సోమవారం అదే మండలంలోని మరో ఇంజినీరింగ్‌ కళాశాలకు వెళ్లింది. అక్కడ పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ బట్టు వెంకటేశ్‌ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. చరవాణి నెంబరు ఇవ్వాలని వేధించాడు. ఆ సమయంలో ఎదురుతిరిగితే పరీక్షకు ఆటంకం కలుగుతుందని భావించిన విద్యార్థిని.. పరీక్ష అనంతరం తాను చదువుతున్న కళాశాలకు వెళ్లి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. ఆరా తీసిన కళాశాల సిబ్బంది మంగళవారం ఇన్విజిలేటర్‌ వెంకటేశ్‌ను కళాశాలకు పిలిపించి నిలదీశారు. ‘‘నాకు ఆ అమ్మాయి నచ్చింది. అందుకే అలా చేశా’’ అని వెంకటేశ్‌ చెప్పడంతో ఆగ్రహించిన కళాశాల యాజమాన్యం, విద్యార్థులు అతడికి దేహశుద్ధి చేశారు. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వెంకటేశ్‌ను అరెస్ట్‌ చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.