Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145622
            [news_title_telugu_html] => ఆకలి తీర్చేందుకు రైల్వే కొత్త ఆలోచన
            [news_title_telugu] => ఆకలి తీర్చేందుకు రైల్వే కొత్త ఆలోచన
            [news_title_english] => Railways takes New step for prevent food wastage
            [news_short_description] => స్టేషన్లలో ఆహార వృథాను అరికట్టేందుకు రైల్వేశాఖ అమలు చేసిన కొత్త ప్రయోగం సత్ఫలితాలనిస్తోంది. ప్రయాణికుల వద్ద, దుకాణాల్లో మిగిలిపోయిన ఆహారాన్ని చెత్త బుట్టల్లో పడేస్తున్న నేపథ్యంలో దాన్ని అన్నార్థుల ఆకలి తీర్చేందుకు ఉపయోగించాలని రైల్వేశాఖ 

            [news_tags_keywords] => Indian Railways, Public fridge, food wastage, Hubballi
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-21 23:22:14
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
ఆకలి తీర్చేందుకు రైల్వే కొత్త ఆలోచన - Railways takes New step for prevent food wastage - EENADU
close

తాజా వార్తలు

ఆకలి తీర్చేందుకు రైల్వే కొత్త ఆలోచన

ఆహార వృథాను అరికట్టడమే లక్ష్యం

దిల్లీ: స్టేషన్లలో ఆహార వృథాను అరికట్టేందుకు రైల్వేశాఖ అమలు చేసిన కొత్త ప్రయోగం సత్ఫలితాలనిస్తోంది. ప్రయాణికుల వద్ద, దుకాణాల్లో మిగిలిపోయిన ఆహారాన్ని చెత్త బుట్టల్లో పడేస్తున్న నేపథ్యంలో దాన్ని అన్నార్థుల ఆకలి తీర్చేందుకు ఉపయోగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా కర్ణాటకలోని హుబ్లీ రైల్వేస్టేషన్‌లో ప్రజారిఫ్రిజిరేటర్‌ను ఏర్పాటు చేసింది. దుకాణదారుల వద్ద ఆహారం మిగిలిపోయినా లేదా ప్ర్రయాణికులు ఎక్కువ ఆహారం తీసుకెళ్తున్నా.. తమ అవసరానికి మించి ఎక్కువైన పదార్థాలను ఇందులో ఉంచవచ్చు. తద్వారా ఆహారం కొనే స్తోమత లేని పేద ప్రయాణికులు, దివ్యాంగులు రిఫ్రిజిరేటర్‌లో ఉన్న పదార్థాలు తీసుకొని తినే వెసులుబాటు ఉంటుంది.
ఆగస్టు 15న ప్రయోగాత్మకంగా దక్షిణ పశ్చిమ రైల్వేజోన్‌లోని హుబ్లీ స్టేషన్‌లో రిఫ్రిజిరేటర్‌ను ఏర్పాటు చేయగా.. దాదాపు 100 మంది దీన్ని వినియోగించుకున్నారని రైల్వే అధికారులు తెలిపారు. రూ.80 వేలతో ఏర్పాటు చేసిన ఆరడుగుల ఎత్తైన ప్రజారిఫ్రిజిరేటర్‌లో పై రెండు అరలు వండిన ఆహారం కోసం, కింది రెండు అరలు పండ్లు, కూరగాయలకు కేటాయించారు. అయితే, మరిన్ని స్టేషన్లలో ఇలాంటి రిఫ్రిజిరేటర్ల ఏర్పాటు కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని రైల్వే అధికారులు కోరారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.