close

తాజా వార్తలు

నియంతపాలనకు బుద్ధి చెబుతారు:కోమటిరెడ్డి

హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ ఉపఎన్నికను నియంత పాలనకు.. తెలంగాణ ఆడపడుచుకు మధ్య జరుగుతున్న యుద్దంగా భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అభివర్ణించారు. ఈ యుద్దంలో ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడి గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు కోమటిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికలో నియంత కేసీఆర్‌కు హుజూర్‌నగర్‌ ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు. ఉపఎన్నికకు ఉత్తమ్ పద్మావతి సోమవారం నామినేషన్‌ దాఖలు చేస్తారని.. ఈ కార్యక్రమంలో తనతోపాటు భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. నామినేషన్‌ అనంతరం హుజూర్‌నగర్‌లో కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.