Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000538
            [news_title_telugu_html] => 

దిల్లీ బయల్దేరిన వెంకయ్యనాయుడు

[news_title_telugu] => దిల్లీ బయల్దేరిన వెంకయ్యనాయుడు [news_title_english] => Venkaiah Naidu going to Delhi [news_short_description] => భాజపా సీనియర్‌నేత అరుణ్‌జైట్లీ (66) మృతి చెందడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు... [news_tags_keywords] => Delhi, Venkaiah Naidu, BiswaBhushan [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 13:27:31 [news_isactive] => 1 [news_status] => 2 ) )
దిల్లీ బయల్దేరిన వెంకయ్యనాయుడు - Venkaiah Naidu going to Delhi - EENADU
close

తాజా వార్తలు

దిల్లీ బయల్దేరిన వెంకయ్యనాయుడు

చెన్నై: భాజపా సీనియర్‌నేత అరుణ్‌జైట్లీ (66) మృతి చెందడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. చెన్నై పర్యటనలో ఉన్న ఆయన ఉన్నపళంగా దిల్లీ బయల్దేరి వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరుణ్‌ జైట్లీ తనకు దీర్ఘకాల మిత్రుడని, అత్యంత సన్నిహితుల్లో ఒకరని అన్నారు. జైట్లీ మృతి దేశానికి, వ్యక్తిగతంగా తనకు కూడా తీరని లోటు అని చెప్పారు. ‘జైట్లీ ఓ ఉత్తమ పార్లమెంటేరియన్‌, న్యాయకోవిదుడు’అని కొనియాడారు. జీఎస్టీ తీసుకురావడంలో జైట్లీ  కీలక పాత్ర పోషించారని, పన్ను విధానంలో సమూల మార్పులకు ఆయన కృషి చేశారని వెంకయ్యనాయుడు అన్నారు. 

సంతాపం తెలిపిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌
భాజపా సీనియర్‌నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ మృతిపై ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.