close

తాజా వార్తలు

ఇక ఇ-సిగరెట్లపై నిషేధం: కేంద్రం

న్యూదిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఇ-సిగరెట్లపై నిషేధం విధించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇక నుంచి వీటి తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, విక్రయాలు, పంపిణీ, నిల్వ చేయడం, ప్రచారం వంటి అంశాలపై నిషేధం విధించినట్లు ఆమె వెల్లడించారు. ఇ-సిగరెట్ల వల్ల యువతపై తీవ్రమైన చెడుప్రభావం పడుతోందని తెలిపారు. అలాగని తాము సాధారణ సిగరెట్లను ప్రోత్సహించడం లేదని చెప్పారు. అమెరికా అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు నిర్మల వివరించారు. పొగాకు వినియోగం తగ్గించాలనేది ప్రభుత్వ ఆశయమన్నారు.

ఈ ప్రతిపాదనను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదించగా.. కేంద్రం ఆమోదించింది. పిల్లలు, యువతలో ఇదొక వ్యసనంగా మారకుండా జాగ్రత్తలు తీసుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఈ ఆర్డినెన్స్‌ తయారు చేసిన బృందానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత వహించారు. మోదీ ప్రభుత్వం తొలి 100 రోజుల అజెండాలో ఇ-సిగరెట్ల నిషేధం కూడా ఉంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.