
తాజా వార్తలు
ముంబయి: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై భాజపా, శివసేన మధ్య ఏర్పడ్డ చిక్కుముడి ఇంకా వీడడం లేదు. ఇరు పార్టీల మధ్య నెలకొన్న మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. శివసేన ప్రముఖ నేత సంజయ్ రౌత్ శుక్రవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనుకోవడం ప్రజల్ని అగౌరపరచడమేనని అభిప్రాయపడ్డారు. సీఎం పదవి శివసేనకు ఇచ్చేందుకు సమ్మతమయితేనే తమ పార్టీని సంప్రదించాలని భాజపాకు తేల్చి చెప్పారు. అపద్ధర్మ ప్రభుత్వం పేరుతో భాజపా అధికార దుర్వినియోగం చెయ్యొద్దన్నారు. పదవీకాలం ముగియనుండటంతో ఫడణవీస్ ముఖ్యమంత్రి పదవికి నేడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అతిపెద్ద పార్టీగా నిలిచిన భాజపాపైనే ప్రభుత్వ ఏర్పాటు బాధ్యత ఉందన్నారు. ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసి కావాలంటే బలనిరూపణకు నెలరోజుల సమయం తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ‘సమస్యల్ని చూసి పారిపోవడం కాదు, వాటి ఎదరుర్కొని పోరాడాలి’ అని అర్థం వచ్చే వాజ్‌పేయి కవితని, భవద్గీత శ్లోకాన్ని ట్విటర్ వేదికగా గుర్తుచేశారు.
అటు అధికారిక పత్రిక సామ్నాలో ప్రస్తుత పరిస్థితులనుద్దేశించి భాజపాపై శివసేన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. మహారాష్ట్రలో నెలకొన్న అస్థిరతకు భాజపాయే కారణమని ఆరోపించింది. గురువారం గవర్నర్‌ని కలిసిన భాజపా ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన చేయలేదంటే సంక్షోభానికి ఆ పార్టీయే కారణమన్న విషయం ప్రజలకు అర్థమవుతోంద్నారు.
మరోవైపు భాజపా సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు ఉదయం ముంబయికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఆయన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు గడ్కరీయే పరిష్కారం చూపగలరన్న వాదన వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రాకపై ఆసక్తి నెలకొంది. దీనిపై సంజయ్ రౌత్ స్పందిస్తూ..‘‘శివసేనకు సీఎం పదవి హామీపై ఆయన ఏదైనా రాయబారం తెస్తేనే తమ పార్టీ ఆలోచిస్తుందని.. లేదంటే ఆయన రాకను సాధారణ పర్యటనగానే భావిస్తాం’’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు కాంగ్రెస్ తన ఎమ్మెల్యేల్ని జైపూర్‌కు తరలించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ సభ్యులకు డబ్బు ఇవ్వజూపేందుకు భాజపా యత్నిస్తోందన్న సమాచారం అందిందని.. అందుకే ఎమ్మెల్యేలను తరలిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే తమ ఎమ్మెల్యేలకు భాజపా ఎరవేసే అవకాశమే లేదని కాంగ్రెస్ ఎంపీ హుస్సేన్ దళ్వాయి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పార్టీ ఫిరాయించిన కొందరు నేతలు తిరిగి రావాలని యోచిస్తున్నారని తెలిపారు. అలాగే కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఎన్సీపీతో కలిసే తీసుకుంటుందన్నారు. ఇక ఈరోజు మధ్యాహ్నం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే సైతం మధ్నాహ్నం పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశమవనున్నారు.
ఈరోజు అర్ధరాత్రి మహారాష్ట్ర శాసనసభా కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. నేతల భేటీలు, హోటళ్లకు ఎమ్మెల్యేల తరలింపులతో మహారాష్ట్ర రాజకీయం వేడెక్కింది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
