close

తాజా వార్తలు

26/11 అమరులకు ఘన నివాళులు

దిల్లీ: ముంబయి మారణహోమానికి నేటితో 11ఏళ్లు. భారత సైనికుల చేతికి చిక్కిన ఉగ్రవాది కసబ్‌ సహా 10మంది ముష్కరులు జరిపిన నరమేధం దేశ చరిత్రలో మరపురాని దుర్ఘటన. ఆ నరరూప రాక్షసుల దాడిలో 166మంది బలయ్యారు. వీరిలో 18మంది పోలీసులు, ఇద్దరు ఎస్‌పీజీ కమాండోలు ఉన్నారు. మరో 300మందికి పైగా గాయపడ్డారు. ఈ నెత్తుటి మరకలకు 11ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నేడు ఆనాటి అమరుల జ్ఞాపకాలను స్మరించుకుంటున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సహా పలువురు ముఖ్యనేతలు వారికి నివాళులర్పించారు. ఈ మారణహోమంలో ప్రాణాలు కోల్పోయివారి త్యాగాలను ఈ దేశం ఎప్పటికీ స్మరించుకుంటుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాఖ్యానించారు. ఉగ్రవాద నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందిస్తూ..‘‘2008లో ముంబయి ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ సందర్భంగా దేశాన్ని కాపాడటంలో ప్రాణత్యాగం చేసిన భద్రతా బలగాలకు నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు’’ అని వారి త్యాగాలను గుర్తుచేసుకున్నారు.

అలాగే మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్ కోశ్యారీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ముంబయిలోని పోలీసుల స్మారకం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మహారాష్ట్ర ఉన్నతాధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.