Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 93706
            [news_title_telugu_html] => 

హడలెత్తించే వేడిలో  హరిచందనాలు!

[news_title_telugu] => హడలెత్తించే వేడిలో  హరిచందనాలు! [news_title_english] => Heavy heat Summer Cool drinks Special page [news_short_description] => ఆయనగారు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోద్ది! కన్నెర్రచేస్తే... శరీరానికి శక్తినిచ్చే లవణాలన్ని హాంఫట్‌ స్వాహానే! చెమటపోయేకొద్ది చేవ తగ్గిపోతుంది.  నాలుక పిడచ కట్టుకుపోతుంది... నరాలు జావకారిపోతాయి.. వేసవికాలంలో ఇంతలా వేధించే మిస్టర్‌ సూర్యారావుకు... [news_tags_keywords] => Heavy heat, Summer, Cool drinks, Special page [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | | [news_videoinfo] => | | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-05 00:29:31 [news_isactive] => 1 [news_status] => 2 ) )
హడలెత్తించే వేడిలో  హరిచందనాలు! - Heavy heat Summer Cool drinks Special page - EENADU
close

తాజా వార్తలు

హడలెత్తించే వేడిలో  హరిచందనాలు!

ఆయనగారు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోద్ది! కన్నెర్రచేస్తే... శరీరానికి శక్తినిచ్చే లవణాలన్ని హాంఫట్‌ స్వాహానే! చెమటపోయేకొద్ది చేవ తగ్గిపోతుంది.  నాలుక పిడచ కట్టుకుపోతుంది... నరాలు జావకారిపోతాయి.. వేసవికాలంలో ఇంతలా వేధించే మిస్టర్‌ సూర్యారావుకు... చందనంతో చెక్‌పెట్టొచ్చు! జీరాతో వడదెబ్బ తగలకుండా... చల్లగా జారుకోవచ్చు ఆయుర్వేదం చిలికిన పానీయాలతో... నిస్సత్తువ దరిచేరకుండా కాపాడుకోవచ్చు. ఎండ నుంచి కాపుకాసే అలాంటి వెరైటీలు మీకోసం...

మజ్జిగలోని బయోయాక్టివ్‌ ప్రొటీన్లు శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సాయపడతాయి. మజ్జిగ చక్కని ఎలక్ట్రోలైట్‌లా పనిచేస్తుంది. వేడి, చెమట కారణంగా కోల్పోయిన లవణాలని తిరిగి అందిస్తుంది. విటమిన్ల లోపం కారణంగా వచ్చే అనేక సమస్యలకు మజ్జిగతో చెక్‌పెట్టొచ్చు.


మజ్జిగతో(తక్ర ఏలా)

కావాల్సినవి: పెరుగు- కప్పు, నీళ్లు- మూడు కప్పులు, పంచదార- తగినంత, యాలకులు- రెండు(పొడి చేసుకోవాలి), రోజ్‌వాటర్‌- చెంచాడు(తాజా గులాబీ రేకలని ముద్ద చేసుకున్నా సరే)
తయారీ: పెరుగుని చక్కగా చిలికి ఇందులో నీళ్లు, తగినంత పంచదార, రోజ్‌వాటర్‌, యాలకులపొడి వేసుకుంటే ఈ పానీయం సిద్ధమవుతుంది. ఇది పిత్తదోషాన్ని తగ్గిస్తుంది. అంటే వేడిని అదుపులో ఉంచుతుంది. వేసవి నిస్సత్తువని దూరం చేసి... ఉత్సాహాన్ని అందిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. 


పుదీనాతో (ధాన్యక నింబాది పానీయం)

కావాల్సినవి: పుదీనా ఆకులు- అరకప్పు, కొత్తిమీర తరుగు- పావుకప్పు, నిమ్మరసం- ఐదుచెంచాలు, జీలకర్ర- రెండు చెంచాలు, చింతపండు- నిమ్మకాయంత, పంచదార- నాలుగు చెంచాలు, నల్లఉప్పు- తగినంత, చల్లటినీళ్లు- ఎనిమిది కప్పులు
తయారీ: పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, చింతపండు, చక్కెర, నిమ్మరసం వీటన్నింటిని బ్లెండర్‌లో వేసి కలపాలి. బాగా నలిగాక నీళ్లు కలిపి వడకట్టుకుని పానీయం తయారుచేసుకోవాలి. ఈ పానీయం అతిగా దాహం వేయకుండా అడ్డుకుంటుంది. పిత్త, కఫ, వాత దోషాలని తగ్గిస్తుంది. వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 


తేటనీటితో...(దధిమండలో పానీయం)

కావాల్సినవి: పెరుగుపై ఉండే తేటనీళ్లు- గ్లాసుడు, తేనె- చెంచా, నెయ్యి- అరచెంచా, చక్కెర- చెంచా, యాలకులపొడి- రెండు చిటికెలు
తయారీ: ఒక కుండ తీసుకుని దానిలో ముందుగా పెరుగుపై ఉండే నీరు వేసుకోవాలి. అవి చల్లగా అయిన తర్వాత తేనె, నెయ్యి, చక్కెర, యాలకులపొడి వేసుకుని బాగా కలిపి తాగితే చాలా మంచిది. చలువ చేసే పానీయం ఇది. ఈ పానీయం నిస్సత్తువ తొలగించి హుషారుని ఇవ్వడమే కాకుండా వాత, పిత్త, కఫ దోషాలు మూడింటినీ అదుపులో ఉంచుతుంది.


చందనంతో (చందన క్షీరం)

కావాల్సినవి: ఇంట్లో అరగదీసిన చందనం లేదా ఆయుర్వేద దుకాణంలో కొన్న చందన చూర్ణం- అరచెంచా, పటికబెల్లం- చెంచాడు, చల్లనిపాలు- గ్లాసుడు
తయారీ: పాలల్లో చందనం, పటికబెల్లం వేసి బాగా కలిపి తీసుకుంటే వేసవిలో ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని బయటకు నెట్టేస్తుంది. మూత్ర సమస్యలు, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. పాలు అంటే ఇష్టం లేని వారు చల్లని నీటితో కూడా కలుపుకోవచ్చు. 


వట్టి వేళ్లతో

కావాల్సినవి: వట్టి వేళ్లు- 50గ్రా, పంచదార- 300గ్రా, నిమ్మకాయలు- రెండు
తయారీ: వట్టివేళ్లని మట్టిలేకుండా రెండు మూడు సార్లు శుభ్రం చేసి పెట్టుకోవాలి. అలా శుభ్రం చేసిన వేళ్లని చిన్న ముక్కలుగా కత్తిరించుకుని 800 మి.లీ నీటిలో పన్నెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత వడకట్టి ఆ నీళ్లను మాత్రమే తీసుకోవాలి. ఈ నీటిని శీత కషాయం అంటారు. ఈ నీటిలో పటికబెల్లం లేదా చక్కెరని వేసి పూర్తిగా కరగనివ్వాలి. దీనిని పొయ్యిమీద పెట్టి పాకం వచ్చేంతవరకూ లేదా చిక్కగా అయ్యేంత వరకూ కరిగించుకోవాలి. చల్లారిన తర్వాత అందులో నిమ్మకాయరసం పిండుకోవాలి. రుచిని బట్టి సగం లేదా మూడోవంతు పానీయానికి నీళ్లు కలిపి తాగాలి.


జీరాతో (తక్ర జీరా)


కావాల్సినవి: పెరుగు- కప్పు, నీళ్లు- మూడు కప్పులు, జీలకర్రపొడి- పావుచెంచా, కొత్తిమీర రసం- రెండు చెంచాలు, నల్లఉప్పు- తగినంత
తయారీ: పెరుగు, నీళ్లు, జీలకర్రపొడి, కొత్తిమీరరసం అన్నింటిని కలిపి పానీయం తయారుచేసుకోవాలి. ఈ పానీయం ఎండ వేడిమి నుంచి రక్షణ కల్పిస్తుంది. శరీరంలోని పిత్తదోషాన్ని అరికట్టి చలువ చేస్తుంది. చెమట కారణంగా శరీరం కోల్పోయిన లవణాలని తిరిగి అందిస్తుంది. నిస్సత్తువ రాకుండా చేస్తుంది.

-డాక్టర్‌ గాయత్రీదేవి

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.