Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 95425
            [news_title_telugu_html] => 

శీతలం.. కాస్త పదిలం

[news_title_telugu] => శీతలం.. కాస్త పదిలం [news_title_english] => Precautions in the summer [news_short_description] => సమశీతోష్ణ స్థితి ఉండే మన ప్రాంతంలో అతి ఉష్ణంతో పాటు అతి శీతలం కూడా ప్రమాదకరమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిప్పులు చెరుగుతున్న ఎండలో తిరగడం, అదేవిధంగా చల్లదనానికి ... [news_tags_keywords] => Precautions,summer [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-08 08:58:49 [news_isactive] => 1 [news_status] => 2 ) )
శీతలం.. కాస్త పదిలం - Precautions in the summer - EENADU
close

తాజా వార్తలు

శీతలం.. కాస్త పదిలం

నిర్వహణ లోపంతో ఆరోగ్యానికి ముప్పే
ఏసీల వినియోగంలో జాగ్రత్తలూ అవసరం

అమరావతి: సమశీతోష్ణ స్థితి ఉండే మన ప్రాంతంలో అతి ఉష్ణంతో పాటు అతి శీతలం కూడా ప్రమాదకరమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిప్పులు చెరుగుతున్న ఎండలో తిరగడం, అదేవిధంగా చల్లదనానికి హిమాలయ ప్రాంతాల వాతావరణాన్ని సృష్టించుకోవడం ఆరోగ్యానికి చేటు చేస్తాయని వివరిస్తున్నారు. మండే ఎండల నుంచి ఉపశమనానికి వాడుతున్న ఏసీల నిర్వహణలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని పేర్కొంటున్నారు. మనిషి శరీర ఉష్ణోగ్రత సహజంగా 36-37 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉంటుందని, ఇళ్లతో పాటు చాలా హోటళ్లు, కార్యాలయాలు, వాణిజ్య ప్రదేశాల్లో ఏసీ ఉష్ణోగ్రతను 13-21 డిగ్రీలు కూడా ఉంచుతున్నారని గుర్తు చేస్తున్నారు.

ఏసీల నిర్వహణ ముఖ్యం
 కంపెనీ ఇచ్చిన వారంటీ ప్రకారం ఏసీ యంత్రాల సర్వీసింగు చేయిస్తున్నారు. ఆ తరువాత బాగా పనిచేస్తున్నాయన్న ఉద్దేశంతో మిన్నకుంటున్నారు. వాటికి క్రమబద్ధంగా సర్వీసింగు చేయించాల్సి ఉంది.
 ఏసీల నిర్వహణ లోపం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  సమయానికి ఫిల్టర్లను శుభ్రం చేయనట్లయితే పుప్పొడి, ఫంగస్‌, బ్యాక్టీరియాలాంటివి చేరతాయి. ఏసీలోని గాలి అక్కడక్కడే తిరగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
 చల్లటి ప్రదేశాల్లో బ్యాక్టీరియా వృద్ధి చెంది న్యూమోనియాకు కారణమవుతుంది.
 ఏసీలు గదిలోని తేమను పీల్చేస్తాయి. శరీరానికి ఏసీ తట్టుకునే శక్తి తక్కువగా ఉంటే చర్మం కింది పొరపై ప్రభావం కనిపిస్తుంది. పొడిబారి దురద వస్తుంది. శరీరం ముడతలు పడుతుందని చర్మవ్యాధుల నిపుణురాలు డాక్టర్‌ శిరీష పోలగాని తెలిపారు. సొరియాసిస్‌, ఎగ్జిమాలాంటి సమస్యలున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
 ఏసీల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు వేడిని తట్టుకోలేక చాలామంది ఇబ్బంది పడతారు. శరీరానికి ఉండే ఉష్ణోగ్రతలను భరించే శక్తిని ఏసీలు హరిస్తాయి. దీంతో శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. అతి శీతలంగా ఉన్న ఏసీ గదిలో ఎక్కువసేపు గడిపితే శ్వాస ఇబ్బందులు తలెత్తుతాయి.
 ఏసీల వల్ల ఏర్పడే 24 నుంచి 28 డిగ్రీల సెల్సియస్‌ వాతావరణం డెంగీ కారక దోమల వృద్ధికి అనుకూలమని భారతీయ వైద్య పరిశోధన మండలి వెల్లడించింది.
 కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఏసీల నిర్వహణపై శ్రద్ధ పెట్టడం లేదు. యంత్రాలు దెబ్బతిన్నప్పుడు గదుల్లో ఫ్యాన్లు వేస్తే పాఠాలు సరిగా వినిపించవు.
 సూర్యరశ్మి శరీరానికి అత్యవసరమని, ఇది అందని పిల్లల్లో విటమిన్‌ డి లోపం ఏర్పడుతుందని చిన్నపిల్లల వైద్య నిపుణుడు చలసాని మల్లికార్జునరావు పేర్కొన్నారు.
 ఏసీ ఆన్‌ చేశాక కనీసం అరగంట తరువాతే గదిలోకి వెళ్లి కనీస స్థాయిలో చల్లదనాన్ని ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.