close

తాజా వార్తలు

‘సైరా..’లో వీరారెడ్డిని చూశారా..!

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం నుంచి మరో  లుక్‌ బయటకు వచ్చింది. ప్రముఖ నటుడు జగపతిబాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ఆయన వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, తమన్నా పాత్రలకు సంబంధించిన లుక్స్‌ బయటకు వచ్చాయి. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్ట్‌ 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.