close
17న డల్లాస్‌లో జగన్ పర్యటన

డల్లాస్‌‌: ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి అమెరికాలో తొలిసారి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్‌ ఈనెల 17న డల్లాస్‌ నగరంలోని కేబెల్లే కన్వెన్షన్ సెంటర్‌లో ఉత్తర అమెరికా తెలుగు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని వైఎస్సార్‌సీపీ అమెరికా విభాగం కన్వీనర్‌ రత్నాకర్‌ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి అమెరికా వస్తున్నందుకు అభినందన సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.  

వార్తలు / కథనాలు

మరిన్ని