Latest Telugu News, Headlines - EENADU
close

తాజావార్తలు

12ఏళ్లలో 50వేలకు చేరిన ‘మనబడి’ అక్షర సైన్యం

కీలక మైలురాయి చేరిన సిలికానాంధ్ర ‘మనబడి’

వాషింగ్టన్‌: ప్రవాస తెలుగు చిన్నారులకు మాతృభాష నేర్పిస్తున్న సిలికానాంధ్ర ‘మనబడి’ మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. గత 12 ఏళ్లుగా అమెరికాలోని 35 రాష్ట్రాల్లో 250 ప్రాంతాలతో పాటు మరో 10 దేశాల్లో ‘మనబడి’ ద్వారా తెలుగు భాష నేర్చుకుంటున్న విద్యార్థుల సంఖ్య 50వేల మైలు రాయిని చేరిందని ఆ సంస్థ అధ్యక్షులు రాజు చమర్తి తెలిపారు. 2007లో 300 మంది విద్యార్థులతో ప్రారంభమై.. తెలుగు విశ్వవిద్యాలయం సౌజన్యంతో పాఠ్యప్రణాళికను తయారు చేసుకున్న ఈ సంస్థ క్రమంగా ఎదిగి ఈ కీలక మైలురాయి దశకు చేరుకుందన్నారు. 4 నుంచి 6 ఏళ్ల పిల్లల కోసం ఏర్పాటుచేసిన బాలబడిలో ఆరేళ్లుగా ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం తరగతులను నిర్వహిస్తూ వస్తోందన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు పరీక్షలు నిర్వహించగా, ఉత్తీర్ణులైన వారికి యూనివర్సిటీ క్రెడిట్‌తో కూడిన సర్టిఫికెట్లు అందించే ఏకైక విద్యాలయం మనబడి అని రాజు చమర్తి తెలిపారు. మనబడి 50వేల మంది విద్యార్ధులకు చేరిన నేపథ్యంలో 'పుష్కర కాలంలో అక్షర సైన్యం అర లక్ష' అనే నినాదంతో  2వేల మందికి పైగా ఉన్న భాషా సేవకుల తరఫున తెలుగు భాషా సేవకు పునరంకితమవుతున్నామని.. రేపటి తరానికి ప్రతినిధులైన ప్రవాస బాలలకు మాతృభాషతో పాటు మన కళలు, సంస్కృతిని పరిచయం చేసే ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేశామని రాజు వివరించారు.  

సెప్టెంబర్‌ 7నుంచి అమెరికాలో తరగతులు
అమెరికా వ్యాప్తంగా ఉన్న ‘మనబడి’ కేంద్రాలన్నీ  ప్రతిష్టాత్మక WASC ( Western Association of Schools and Colleges)  సంస్థ నుంచి అక్రిడేషన్‌ పొందాయని ‘మనబడి’ ప్రాచుర్యం, అభివృద్ధి విభాగం ఉపాధ్యక్షులు శరత్ వేట అన్నారు. అలాంటి అర్హత సాధించిన ఏకైక తెలుగు విద్యాలయం ‘మనబడి’  మాత్రమేనని చెప్పారు. ఈ విద్యావిధానం గురించి ఇప్పటికే భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి ఎందరో ప్రముఖుల ప్రశంసలు కురిపించారని గుర్తుచేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, భాషా సైనికులు అందిస్తున్న ప్రోత్సాహంతో మరింత ముందుకు సాగుతామని చెప్పారు. సిలికానాంధ్ర ‘మనబడి’ 2019-20 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఈ విద్యా సంవత్సరం తరగతులు సెప్టెంబర్ 7 నుంచి అమెరికా వ్యాప్తంగా 250కి పైగా కేంద్రాల్లో ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. ఆగస్టు 31లోపు నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు, మరిన్ని వివరాల కోసం manabadi.siliconandhra.org వెబ్‌సైట్‌ను లేదా 1-844-626-(BADI) 2234 నంబర్‌ను సంప్రదించవచ్చని సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు ఫనిమాధవ్‌ కస్తూరి తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.