పాలన చూసి ప్రజలు గర్వించాలి: సోనూసూద్‌

తాజా వార్తలు

Published : 13/11/2020 00:52 IST

పాలన చూసి ప్రజలు గర్వించాలి: సోనూసూద్‌

ముంబయి : ప్రజలు గర్వించేలా ప్రభుత్వ పాలన ఉండాలని బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ బిహార్‌ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో లాక్‌డౌన్‌ విధించిన సమయంలో వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు చాలా పడ్డారు. వాళల్లో ఎక్కువ మంది బిహార్‌కు చెందిన వాళ్లే ఉండగా.. సోనూసూద్‌ సొంతంగా బస్సులు ఏర్పాటు చేసి కార్మికులను గమ్యాలకు చేర్చారు. బిహార్‌ ఎన్నికల ఫలితాలు, పాలన గురించి మాట్లాడమని ఓ మీడియా సంస్థ సోనూసూద్‌ను అడగటంతో ఆయన స్పందించారు. 

‘ప్రజలెప్పుడూ మంచి కోసం చూస్తారు. మన దేశంలో ప్రజలు చాలా ఆశలతో ఒక్కోసారి రెండు లేదా మూడో అవకాశం ఇస్తారు. నాకు చాలా మంది బిహారీలతో అనుబంధం ఉంది. విద్యాపరంగా చూసినా మౌలిక వసతుల కల్పన విషయంలో చూసినా ఆ రాష్ర్ట ప్రజలు దారుణమైన స్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచిందనేది ముఖ్యం కాదు.. ఐదేళ్ల పాలన తర్వాత ప్రజల స్థితిగతులు మారాయా లేదా అన్నది ముఖ్యం. ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నందుకు ప్రజలు గర్వపడేలా పాలన ఉండాలి. అన్ని రంగాల్లో రాణించి బిహార్‌ను సరికొత్తగా చూడాలనే ఆకాంక్షతో ఉన్నట్లు’ సోనూసూద్‌ తెలిపారు. 

దేశంలో లాక్‌డౌన్‌ విధించినపుడు కష్టాలు ఎదుర్కొన్న కూలీలు, కార్మికులకు సోనూసూద్‌ అండగా నిలిచారు. ఎంతోమందికి ఆహారం అందించడంతో పాటు వాళ్లకు రవాణా సౌకర్యం కల్పించారు. ఈ క్రమంలో సేవలకుగానూ సోనూసూద్‌ చాలా అవార్డులన అందుకున్నారు. కష్టం అనే మాట వినిపించిన చోట నేనున్నానని ఆసరాగా నిలబడుతున్న ఈ నటుడు ఇటీవల దేశవ్యాప్తంగా అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు సైతం అందజేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని