సోనియా: 50వేలు.. రాహుల్: 54 వేలు
close

తాజా వార్తలు

Published : 05/02/2021 15:41 IST

సోనియా: 50వేలు.. రాహుల్: 54 వేలు

అసమ్మతి వర్గం నుంచి సిబల్ రూ.3కోట్ల విరాళం

దిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రూ.50 వేలు.. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రూ.54 వేలు.. అసమ్మతి వర్గానికి చెందిన సీనియర్ నేత కపిల్ సిబల్ రూ. 3కోట్లు.. ఈ లెక్కలేంటి అనుకుంటున్నారా! పార్టీ ఫండ్‌ కింద కాంగ్రెస్ పార్టీకి అందిన విరాళాలవి.  2019-20 సంవత్సరానికి గానూ కాంగ్రెస్‌కు వచ్చిన విరాళాల వివరాలను ఇటీవల భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) తన వెబ్‌సైట్‌లో పొందుపరచడంతో ఈ లెక్కలు బయటకు వచ్చాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే..అసమ్మతి వర్గం నుంచి తమ గళాన్ని వినిపిస్తున్న వారిలో ముందున్న కపిల్ సిబల్ విరాళం కింద పెద్ద మొత్తం అందించారు. నిబంధనల ప్రకారం.. రాజకీయ పార్టీలు రూ.20వేల కంటే ఎక్కువ మొత్తంలో విరాళాలు అందించిన వారి వివరాలను ఈసీకి వెల్లడించాల్సి ఉంది.  

కాగా,  నాయకత్వ సంక్షోభం, ఇటీవల పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని ఎత్తి చూపుతూ కొద్ది నెలల క్రితం కాంగ్రెస్‌లో అసమ్మతి గళం వినిపించిన సంగతి తెలిసిందే. 23 మంది సభ్యులతో ఉన్న ఆ వర్గం నుంచే పెద్ద మొత్తంలో విరాళాలు అందాయి. వారిలో ఒకరైన కపిల్ సిబల్ అత్యధికంగా మూడు కోట్ల రూపాయలు అందించారు. రాహుల్, సోనియా ఇచ్చిన దానితో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద మొత్తం కావడం గమనార్హం. ఆ వర్గంలోని గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, శశిథరూర్, మిలింద్ డియోరా, రాజ్‌బబ్బర్ పార్టీకి విరాళం ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చి 2020లో భాజపాలో చేరిన జోత్యిరాదిత్య సింథియా కూడా రూ.54వేలు ఇచ్చారు. కాంగ్రెస్ అందించిన నివేదిక ప్రకారం..2019-20 సంవత్సరానికి ఆ పార్టీ మొత్తంగా రూ.139 కోట్లు విరాళంగా అందుకుంది. 2018-19 ఏడాదికి అది రూ.146 కోట్లుగా ఉంది. ఇదిలా ఉండగా.. ఎన్సీపీ, బీఎస్పీ కూడా విరాళాల జాబితాను ఈసీకి అందించాయి. రూ.20వేల కంటే ఎక్కువ మొత్తంలో ఒక్క విరాళం కూడా అందలేదని బీఎస్పీ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. 

ఇవీ చదవండి:

సాగు చట్టాల్లో నలుపు ఏంటి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని