అక్ర‌మ అరెస్టులు ప్ర‌జాస్వామ్యానికి విఘాతం
close

తాజా వార్తలు

Published : 15/05/2021 14:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్ర‌మ అరెస్టులు ప్ర‌జాస్వామ్యానికి విఘాతం

ర‌ఘురామ అరెస్టును ఖండించిన రామకృష్ణ‌, విష్ణుకుమార్‌

అమ‌రావ‌తి: ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు అరెస్టును సీపీఐ  రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ ఖండించారు. ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను ఎత్తిచూపిన వారిపై బెదిరింపులు, అక్ర‌మ అరెస్టుల‌కు పాల్ప‌డ‌టం దుర్మార్గ‌మ‌న్నారు. ప్ర‌జాస్వామ్యానికి, భావ ప్ర‌క‌టనా స్వేచ్ఛ‌కు ఇలాంటి ఘ‌ట‌న‌లు విఘాతం క‌ల్గిస్తున్నాయ‌న్నారు. దేశ‌మంతా క‌రోనాతో అల్లాడుతుంటే సీఎం జ‌గ‌న్ క‌క్ష సాధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. ఎంపీని అరెస్టు చేసి త‌న పాల‌న‌ను ఎవ‌రు విమ‌ర్శించినా ఊరుకునేది లేదనే సంకేతాలిచ్చార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు రామ‌కృష్ణ అధికారిక‌ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

మ‌రోవైపు.. ఎంపీ అరెస్టును భాజ‌పా నేత విష్ణుకుమార్ కూడా ఖండించారు. ర‌ఘురామ‌ను అరెస్టు చేసిన తీరు గ‌ర్హ‌నీయ‌మ‌న్నారు. ఎంపీ ప‌ట్ల పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రికాద‌ని చెప్పారు. ఆయ‌న ప‌ట్ల దౌర్జ‌న్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం దారుణ‌మ‌ని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఎవ‌రైనా త‌ప్పు చేస్తే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌వ‌ని తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని