మరింత కఠినంగా మున్సిపల్‌ చట్టం:కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 16/01/2020 19:17 IST

మరింత కఠినంగా మున్సిపల్‌ చట్టం:కేటీఆర్‌

అభ్యర్థులకు ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం

హైదరాబాద్‌: నూతన మున్సిపల్‌ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ ప్రజలకు పారదర్శక, వేగవంతమైన పౌరసేవలను అందిస్తామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ పట్టణాలు దేశంలోనే ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కార్పొరేషన్‌లు, పట్టణాలకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం తెరాస అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బరిలో ఉన్న తెరాస అభ్యర్థులతో కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి వార్డు, పట్టణాల అవసరాల మేరకు స్థానిక మేనిఫెస్టోను విడుదల చేయాలని కేటీఆర్ వారికి సూచించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారం నిర్వహించాల్సిన తీరుపైన అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తే గెలుపు ఖామమన్నారు. ఎన్నికలకు సంబంధించి కేంద్ర పార్టీ కార్యాలయం ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటుందని అన్నారు. రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులతో మాట్లాడిన కేటీఆర్‌ అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్, తెరాస పార్టీల పాలనను బేరీజు వేసుకొని ఓటు వేయాలంటూ ప్రజలను కోరాలని అభ్యర్థులకు కేటీఆర్‌ సూచించారు. తాజా నివేదికల ప్రకారం పురపాలక ఎన్నికల్లో తెరాస విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గెలుపు మనదే అన్న అత్యుత్సాహంతో ప్రచారంలో అభ్యర్థులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. పార్టీ బీ-ఫారం కోసం ప్రయత్నించిన తోటి నేతలను కలుపుకుని ఐక్యంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ఫలితాల తర్వాత గెలిచిన అభ్యర్థులతో మరోసారి సమావేశం నిర్వహిస్తామని కేటీఆర్ వివరించారు.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని