‘పుంజుకున్నా.. అందుకే ఓడిపోయాం’

తాజా వార్తలు

Published : 14/02/2020 00:56 IST

‘పుంజుకున్నా.. అందుకే ఓడిపోయాం’

దిల్లీ: దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూడడంతో భారతీయ జనతా పార్టీ ఫలితాలపై విశ్లేషించుకునే పనిలో పడింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే పార్టీ ఓటింగ్‌ శాతం పెరిగినప్పటికీ.. ద్విముఖ పోరు పార్టీ ఓటమికి కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దిల్లీ ఎన్నికల్లో ఆప్‌ 62 స్థానాల్లో గెలుపొందగా.. విస్తృతంగా ప్రచారం చేసిన భాజపాకు కేవలం 8 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. దిల్లీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌తో గురువారం సమీక్షించారు. పార్టీ ప్రధాన కార్యదర్శలందరూ దాదాపు ఈ సమావేశానికి హాజరయ్యారు.

దిల్లీ ఎన్నికల కోసం ఓటర్లను చేరుకునేందుకు పార్టీ శక్తివంచన లేకుండా కృషి చేయడంతో 8 శాతం మేర ఓటింగ్‌ పెరిగిందని, అయితే ద్విముఖ పోరు కావడంతో ఓడిపోయామన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. దీంతో భవిష్యత్తులో దిల్లీలో జరిగే ఎన్నికల్లో ద్విముఖ పోరుకు పార్టీ సన్నద్ధమవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని