గవర్నర్‌తో మండలి ఛైర్మన్‌ కీలక భేటీ

తాజా వార్తలు

Published : 18/02/2020 18:56 IST

గవర్నర్‌తో మండలి ఛైర్మన్‌ కీలక భేటీ

అమరావతి: ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న ఆయన.. పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులపై సెలెక్ట్‌ కమిటీ నియమించే అంశంపై గవర్నర్‌తో కీలకంగా చర్చించనున్నారు. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ఛైర్మన్‌ రెండుసార్లు కార్యదర్శిని ఆదేశించినా మండలి కార్యాలయం సంబంధిత ఫైలును వెనక్కి పంపించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై అసంతృప్తితో ఉన్న షరీఫ్‌.. మండలిలో చోటుచేసుకున్న పరిణామాలను గవర్నర్‌కు వివరించనున్నట్టు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని