హైకోర్టును ఆశ్రయించిన రఘురామకృష్ణరాజు

తాజా వార్తలు

Published : 03/07/2020 10:03 IST

హైకోర్టును ఆశ్రయించిన రఘురామకృష్ణరాజు

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటు, సస్పెన్షన్‌ చర్యలు అడ్డుకోవాలని పిటిషన్‌ దాఖలు చేశారు. తాను పార్టీ వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు పాల్పడలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

 యువజన రైతు శ్రామిక పార్టీ తరఫున తాను ఎన్నికయ్యాయని  కానీ,  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లెటర్‌హెడ్‌పై తనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారని  రఘురామకృష్ణరాజు వివరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లానని, ఈసీ నిర్ణయం తీసుకునే వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని పిటిషన్‌లో కోరారు.  ప్రస్తుతం కరోనా దృష్ట్యా అత్యవసర కేసులను మాత్రమే హైకోర్టు విచారిస్తోంది. రఘురామకృష్ణరాజు పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని