
తాజా వార్తలు
సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
తృణమూల్‌లోనే ఉంటానని ఎంపీ స్పష్టీకరణ
కోల్‌కతా: బెంగాల్లో ఎన్నికల వాతావరణం నెలకొన్న వేళ చెలరేగిన రాజకీయ సస్పెన్స్‌కు బిర్భూమ్ ఎంపీ శతాబ్ది రాయ్ తెరదించారు. తాను తృణమూల్ కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. అలాగే, రేపటి దిల్లీ పర్యటనను సైతం రద్దు చేసుకుంటున్నట్టు చెప్పారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో భేటీ అయిన అనంతరం ఆమె ఈ ప్రకటన చేయడం గమనార్హం.
తన పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల షెడ్యూల్‌పై సమాచారం లేకపోవడం వల్లే తాను సమావేశాలకు హాజరు కాలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేస్తూ శతాబ్ది రాయ్ ఫ్యాన్స్ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఇది తనను ఎంతో మానసిక వేదనకు గురిచేస్తుందంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేయడం రాజకీయంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే శనివారం దిల్లీ వెళ్తానని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా మధ్యాహ్నం 2గంటలకు తెలియపరుస్తానంటూ పోస్ట్‌లో పేర్కొనడంతో సీనియర్ నేతగా ఉన్న శతాబ్ది రాయ్ భాజపాలో చేరే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి.
ఇదీ చదవండి..
మమతకు శతాబ్ది రాయ్ షాక్ ఇవ్వబోతున్నారా?