‘వ్యవస్థలు శాశ్వతం.. వ్యక్తులు కాదు’

తాజా వార్తలు

Updated : 22/07/2020 20:18 IST

‘వ్యవస్థలు శాశ్వతం.. వ్యక్తులు కాదు’

ఏపీ ప్రభుత్వ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

అమరావతి: వ్యవస్థలు ఎప్పటికైనా శాశ్వతం.. వ్యక్తులు కాదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. విలేకర్లతో శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇలాంటి పరిస్థితుల్లో ఆ స్థానానికి నిమ్మగడ్డ ఎలా న్యాయం చేస్తారు? కోట్ల రూపాయల లాయర్‌ ఫీజులు నిమ్మగడ్డ ఎలా చెల్లిస్తున్నారు?. వ్యక్తిగత విషయాల జోలికి మేం వెళ్లట్లేదు. ప్రభుత్వంపై నిమ్మగడ్డ ఎందుకు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ప్రశ్నించారు. 

 రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తిరిగి నియమించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్‌ లేఖ పంపారు. మే 29 నాటి హైకోర్టు తీర్పును వెంటనే ఆమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని