గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, బోధన్‌లో తెరాస విజయం

తాజా వార్తలు

Published : 03/05/2021 18:50 IST

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, బోధన్‌లో తెరాస విజయం

ఇంటర్నెట్ డెస్క్‌: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పురపాలిక ఎన్నికలో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ 12వ వార్డులో తెరాస అభ్యర్థి అత్తిలి శ్రీనివాస్‌ విజయం సాధించారు. 1108 ఓట్లతోపాటు 11 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించారు. తెరాస అభ్యర్థికి 703 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థికి 372, భాజపా అభ్యర్థికి 33 ఓట్లు, నోటాకు 1, చెల్లనివి పది ఓట్లుగా అధికారులు లెక్క తేల్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నాయిని యాదగిరిపై తెరాస అభ్యర్థి అత్తిలి శ్రీనివాస్‌ 331 ఓట్లతో విజయం సాధించారని అధికారులు ప్రకటించారు.

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మున్సిపాలిటీలో 18వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి గంగారాం గెలుపొందారు. 1199 ఓట్లు పోలవ్వగా తెరాస అభ్యర్థి 510 ఓట్లు దక్కించుకొని 175 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గెలుపొందిన అభ్యర్థులకు అధికారులు ధ్రువపత్రాలు అందజేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని