అందుకే మీ జేబుల్లోంచి లాక్కుకుంటున్నారు

తాజా వార్తలు

Updated : 23/03/2021 05:15 IST

అందుకే మీ జేబుల్లోంచి లాక్కుకుంటున్నారు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

కొచ్చి: పెట్రోల్‌, డీజిల్ ధరల పెంపు విషయంలో భాజపా నేతృత్వంలో కేంద్ర సర్కారుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నడిపే తీరు తెలీక.. ఖజానాలో డబ్బుల్లేకనే ప్రజల జేబుల్లోంచి పెట్రోల్‌, డీజిల్‌ రూపేణా బలవంతంగా డబ్బులు లాక్కుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం కేరళలో పర్యటించిన ఆయన.. ఇక్కడి ఓ కళాశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. క్రూడాయిల్‌ ధరలు తగ్గినప్పటికీ చమురు ధరలు ఎక్కువ ఉండడంపై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు రాహుల్‌ సమాధానంగా ఈ విధంగా స్పందించారు.

నోట్ల రద్దు, జీఎస్టీ వంటి భాజపా అనాలోచిత నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, కొవిడ్‌తో ఆ పరిస్థితి మరింత దిగజారిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటే ప్రజల చేతికి డబ్బులిచ్చి వినియోగం పెంచాలని పేర్కొన్నారు. తద్వారా వినియోగం పెరిగి పన్ను వసూళ్ల ద్వారా డబ్బులు ఖజానాకు చేరుతాయన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందన్నారు. పన్ను రాబడి ఎలా పెంచాలో తెలీక ఖజానా ఖాళీ అవ్వడంతో.. ప్రభుత్వాన్ని నడిపేందుకు పెట్రోల్‌, డీజిల్‌ రూపంలో ప్రజల జేబుల్లోంచి నేరుగా లాక్కుంటున్నారు అని రాహుల్‌ విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని