Devineni Uma: రాజమహేంద్రవరం జైలు నుంచి దేవినేని ఉమ విడుదల

తాజా వార్తలు

Updated : 05/08/2021 22:30 IST

Devineni Uma: రాజమహేంద్రవరం జైలు నుంచి దేవినేని ఉమ విడుదల

రాజమహేంద్రవరం: తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జి.కొండూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ దేవినేని ఉమ హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్‌ ఇచ్చిన నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలు నుంచి దేవినేని ఉమ విడుదలయ్యారు. ఆయన విడుదల సందర్భంగా జైలు వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.

జైలు నుంచి విడుదలైన అనంతరం ఉమ మీడియాతో మాట్లాడారు.  ప్రభుత్వం కుట్రలు చేసినా న్యాయదేవత అనుగ్రహంతో విడుదలయ్యానని చెప్పారు. అక్రమ నిర్బంధాలతో తమ పోరాటం ఆగదన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని