Ap Politics: రహదారిపై గోతులు పూడ్చుతూ తెదేపా నేతల నిరసన

తాజా వార్తలు

Published : 24/07/2021 14:43 IST

Ap Politics: రహదారిపై గోతులు పూడ్చుతూ తెదేపా నేతల నిరసన

దెందులూరు: రహదారులు స్వచ్ఛందంగా మరమ్మతులు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పెదవేగి మండలం బాపిరాజుగూడెంలో రహదారులపై ఉన్న గోతులను శనివారం తన అనుచరులతో కలిసి పూడ్చారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తెదేపా నాయకులు ఏలూరు-చింతలపూడి రోడ్డులో బాపిరాజుగూడెం పరిధిలోని రామచంద్రాపురంలో గోతులు పూడ్చే చర్యలు చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకొని గోతులు పూడ్చడానికి అనుమతులు లేవంటూ అడ్డుకున్నారు. అనంతరం అక్కడ నుంచి కొయ్యలగూడెంలో జరిగే ఆందోళన కార్యక్రమానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ.. రహదారులపై గోతులు ప్రాణాంతకంగా మారాయన్నారు. ప్రజలు తమ ప్రాణాలు చేతబట్టి ప్రయాణించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని, దానిని మేల్కొల్పేందుకే రహదారులపై గోతులు పూడ్చే చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలలో బొప్పన సుధాకర్, మాగంటి నారాయణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

జుజ్జూరులో తెదేపా నాయకుల అరెస్టు

కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలోని అ్లలూరు గ్రామంలో రహదారుల పరిస్థితిపై తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు, విజయవాడ పార్లమెంటరీ తెదేపా ఇంఛార్జీ నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు శ్రీరాం తాతయ్య, తంగిరాల సౌమ్య, గద్దె రామ్మోహన్ రావు, తదితరులను అడ్డుకోవడానికి భారీగా వైకాపా కార్యకర్తలు తరలివచ్చారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నందిగామ గ్రామీణ సీఐ నాగేంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు తెదేపా నాయకులను మండలంలోని జుజ్జూరు గ్రామంలో అరెస్టు చేశారు. ఈ మేరకు దేవినేని మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు. వైకాపా నాయకులు దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. అరెస్టు చేసిన నాయకులను చందర్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు పార్టీలు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని